హౌస్‌లోకి ఎంట్రీ పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్.. బిగ్‌బాస్ విన్నర్ కానున్నాడా?
Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రోజు బీబీ హౌస్ లోకి 14 మంది అడుగుపెట్టనున్నారు.. అందులో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు.. అది కూడా జంటగా వెళ్లనున్నారు. ప్రేరణ, యష్మి, బెజవాడ బేబక్క , కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్ మరికాసేపట్లో హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా ఎనర్జీ గా దేవర పాటతో కింగ్ అక్కినేని నాగార్జున షోలో ఎంటర్ అయ్యారు. నేచర్ థీమ్ బేస్డ్ తో బీబీ హౌస్ రెడీ చేశామన్నారు నాగార్జున.
ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 8లో 'నాటీ నాటీ గాళ్' పాటకు స్టెప్పులు వేస్తూ ఫస్ట్ కంటెస్టెంట్ పరిచయం అయ్యారు యష్మీ గౌడ. ఆ తర్వాత 'మ్యాడ్'లో సాంగ్స్ కేకపుట్టించారు. ఆ తరువాత 'బిగ్ బాస్ 8'లో కన్నడ స్టార్, 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'లో సందడి చేసిన నిఖిల్ మిలియక్కల్ రెండో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.

ఆ తరువాత మూడో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్‌లోకి పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్ ఎంట్రీ అయ్యారు. అభయ్ కోసం ఓ సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చారు కింగ్ నాగ్.. తనకు తెలియకుండా.. అతని భార్య వీడియో మెసెజ్ తో స్వాగతం పలికారు. మీ కోసం విషయం తెలుసా.. అభయ్ అన్నపూర్ణ యాక్టింగ్ స్టూడెంట్ అంట..
అభయ్ నవీన్ బయోగ్రఫీ..
'రామన్న యూత్' చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అభయ్ నవీన్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఫైర్ ఫ్లై ఆర్ట్స్, మాడ్ గుడ్ క్రియేటివ్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మించారు. ఈ చిత్రానికి అభయ్ నవీన్ దర్శకత్వం వహించగా కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అభయ్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నటీనటులు కూడా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు.
అభయ్ నవీన్, అనిల్ గీల, అమూల్య రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేశ్, అంజి వల్గుమాన్, కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి, జగన్ యోగిరాజ్, జగన్ యోగిరాజ్,బజర్దస్త్ రోహిణి, బన్నీ అభిరామ్, యాదమ్మ రాజు, ఎస్.వి. విష్ణు, విద్యాసాగర్ కారంపూరి, బజర్దస్త్ రోహిణి, మనోజ్ ముత్యం, వేణు పొల్సాని' వంటి నటీనటులు రామన్న యూత్ చిత్రంలో అద్భుతంగా నటించారు.
ఇకపోతే అభయ్ నవీన్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నిడేస్ కన్ఫూజన్‌లో ఉన్న అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అభయ్ నవీన్ హౌస్‌లో ఎలా ఆడబోతున్నాడంటూ ఈగర్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్ అభయ్ నవీనే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరీ అభయ్ నవీన్ ఫార్మామెన్స్ ఎలా ఉండబోతుందనేది చూడాలి మరీ. ఆల్రెడీ మా టీవీలో అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అయింది. పరిచయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రజలంతా కనురెప్పకుండా టీవీల్లో ముఖాలు పెట్టి వీక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











