Bigg Boss Telugu 8: తెలుగు బిగ్ బాస్‌లో సంచలన పొరపాటు.. కలకలం రేపుతున్న స్పెషల్ ‘గిఫ్ట్’

ఉత్తరాది నుంచి పరిచయం అయినప్పటికీ.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే షోకూ దక్కని రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకెళ్తోంది బిగ్ బాస్. అందుకే ఇది ఎన్నో సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. అదే సమయంలో రికార్డులు కూడా బ్రేక్ చేసేసింది. ఇక, ఈ మధ్యనే ఎనిమిదో సీజన్‌ను సైతం నిర్వహకులు మొదలెట్టారు. ఎన్నో అంచనాల నడుమ మొదలైన దీనికి సైతం మంచి స్పందనే వస్తోంది. అదే సమయంలో షోపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ పొరపాటు బయటపడింది. అది మీరే చూడండి!

సరికొత్త కంటెంట్‌తో ఫుల్లు
ఒకే రకమైన టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాకులు, ఫైటింగ్‌లు ఇలా గత సీజన్లు మొత్తం ఒకే తరహాలో నడిచినట్లు అనిపించాయి. ఈ పరిస్థితుల్లో నిర్వహకులు పంథాను మార్చుకుని గత సీజన్ సక్సెస్ చేసుకున్నారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో కొత్త కాన్సెప్టులు చూపించి వినోదాన్ని ఫుల్లుగా పంచుతున్నారు.

Abhay Naveen Wrist Watch Creates Many Doubts on Bigg Boss Show

ఎంత జాగ్రత్త తీసుకున్నా

బిగ్ బాస్ షోలోని దాదాపు అన్ని అంశాలు ఎంతో సీక్రెట్‌గానే జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్స్‌, ఎలిమినేషన్స్ అనే ముఖ్యమైన పరిణామాలు కూడా రహస్యంగానే చేయాలి. కానీ, కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ నుంచి ప్రతి అంశం బయటకు వచ్చేస్తుంది. అందులో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లీక్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి చిన్నగా సన్నగిల్లుతోంది.

స్క్రిప్ట్ షోనే అని డౌట్లతో
బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తుందని నిర్వహకులు మొదటి నుంచీ చెబుతున్నారు. కానీ, అందులో జరిగే కొన్ని విషయాలు మాత్రం ప్రేక్షకులకు సందేహాలను తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో జరిగే కొన్ని ఎలిమినేషన్లు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కాకుండా వాళ్ల సొంతంగా చేస్తున్నారు అని విమర్శలు వచ్చాయి. దీనిపై ఈ డౌట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

టైం తెలియకుండా ప్లాన్

బిగ్ బాస్ షోలోకి వచ్చే కంటెస్టెంట్లకు బయట నుంచి ఎలాంటి విషయాలు తెలియకుండా ప్లాన్ చేస్తారు. ఏదైనా ముఖ్యమైన సమాచారం అయితేనే బిగ్ బాస్ కానీ, హోస్టుగానీ వెల్లడిస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా హౌస్‌లో ఉన్న సెలెబ్రిటీలకు టైం తెలియకుండా నిర్వహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే గడియారం, వాచ్ లాంటివి లోపలికి అనుమతించరు.

బిగ్ బాస్‌లో పొరపాటు
బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ షో అయిన బిగ్ బాస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు వాచ్ ధరించడం నిషేదించారు. అంతెందుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలెబ్రిటీలు సైతం వాచ్ పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకున్నా దాన్ని కవర్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న అభయ్ నవీన్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీంతో దీన్ని చాలా మంది హైలైట్ చేస్తున్నారు.

అసలు ఎలా వచ్చింది?

వీకెండ్‌లో ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అభయ్ నవీన్ చేతికి వాచ్‌తో కనిపించాడు. దీంతో చాలా మంది 'ఇది ఫేక్ షో', 'ఇది స్క్రిప్టెడ్ షో' అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి అభయ్‌కు ఆ వాచ్ స్పెషల్ గిప్టులా వచ్చింది. కానీ, దాన్ని అతడు ధరించడం షో నియమాలకు విరుద్ధం. దీన్ని బిగ్ బాస్ టీమ్ పట్టించుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Read more about: bigg boss telugu 8 abhay naveen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X