ఐదారు నెలలు బెడ్‌పైనే.. బిగ్ బాస్ రావడం వెనుక చాలా కథే ఉంది.. అభిజిత్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షోకి రాకముందు అభిజిత్ జీవితంలో ఎన్ని జరిగాయో తాజాగా బయటకు చెప్పాడు. బిగ్ బాస్ షోకు రావాలా వద్దా? అని చివరి నిషంలో ఫిక్స్ అయ్యాడట. దాని కంటే ముందు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయట. ప్రతీ సీజన్‌కు కూడా అభిజిత్‌కు ఆహ్వానం అందిందట. కానీ ఈ నాల్గో సీజన్‌కు ఓకే చెప్పాడట. దాని వెనుకా పెద్ద కథే ఉందట. ఈ విషయాలన్నీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అభిజిత్ బయటపెట్టేశాడు.

2019 ఆగస్ట్‌లో..

2019 ఆగస్ట్‌లో..

బిగ్ బాస్ జర్నీ ఎలా మొదలైందో చెప్పాలంటే మొదటగా 2019 ఆగస్ట్‌లోకి వెళ్లాలి. ఆసమయంలో నాకు మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఐదారు నెలలు బెడ్ రెస్ట్ కావాలన్నారు. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి బయటకు వెళ్లకూడదు మళ్లీ సర్జర్జీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారని అభిజిత్ చెప్పుకొచ్చాడు.

సర్జరీ లేకుండానే..

సర్జరీ లేకుండానే..

అయితే లక్కీగా సర్జరీ అవసరం లేకుండానే గడిచిపోయింది. కానీ ఆగస్ట్ నుంచి జనవరి వరకు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. అలా ఇంట్లో ఉండి ఉండి చిరాకు లేచింది. జనవరిలో మెల్లిమెల్లిగా నడవడం ప్రారంభించాను. ఫిబ్రవరిలో అలా ఓ టూర్ వేసి వచ్చానంటూ అభిజిత్ తన ప్రయాణం గురించి తెలిపాడు.

లాక్డౌన్‌లో అలా..

లాక్డౌన్‌లో అలా..

ఫిబ్రవరిలో టూర్‌కు వెళ్లి వచ్చాను.. మార్చిలో లాక్డౌన్ వచ్చింది. అలా జూన్ జూలై వరకు ఇంట్లోనే ఉన్నాను. అయితే స్టార్ మాలో నాకు తెలిసిన వాళ్లే ఉన్నారు. రఘు అనే అతను నన్ను అన్ని సీజన్లలో అప్రోచ్ అయ్యారు. ఈ నాల్గో సీజన్‌కు కూడా వస్తావా? అని అడిగాడంటూ అభిజిత్ అసలు విషయం చెప్పాడు.

ఏదో ఒకటి చేయాలి..

ఏదో ఒకటి చేయాలి..

అంతకుముందు బెడ్ రెస్ట్ వల్ల ఐదారు నెలలు ఇంట్లోనే ఉన్నాను.. లాక్డౌన్ వల్ల ఐదారు నెలలు ఇంట్లోనే ఉన్నాను.. ఏదో ఒకటి చేయాలి.. అలా ఖాళీగా ఉండటం నా వల్ల కాలేదు. అందుకే ఆగస్ట్‌లో బిగ్ బాస్‌కు ఓకే చెప్పాను అంటూ అసలు విషయం బయటపట్టేశాడు. వచ్చే ముందు కూడా అలా ఆడాలి ఇలా ఆడాలన్న ఉద్దేశ్యంతో రాలేదు.. ఓ అనుభవం కోసం వచ్చాను అంటూ అభిజిత్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X