సోహెల్ మెహబూబ్ స్కాం వీడియో.. హుందాగా స్పందించిన అభిజిత్.. అందుకే మెచ్యూర్డ్!!
బిగ్ బాస్ ఫినాల ఎపిసోడ్ కంటే ముందే ఓ సెన్సేషన్ జరిగింది. కానీ అది అప్పుడు అంతగా వైరల్ కాలేదు. ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ సోహెల్ 25 లక్షలు తీసుకుని ఆట నుంచి తప్పుకున్నాడనే లీకులు ఎప్పుడైతే శనివారం సాయంత్రం మొదలయ్యాయో అప్పటి నుంచి ఓ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. మెహబూబ్ సోహెల్ కలిసి చేసి స్కాంతో మొత్తం బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ రచ్చ రచ్చగా మారింది.
అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?

ఎన్నోస్థానం అంటూ లీక్..
రీయూనియన్ పేరిట సోహెల్ మెహబూబ్‌లు భారీగానే స్కాం వేశారు. బయట తన స్థానం ఏంటన్నది సోహెల్ అడగడం, మెహబూబ్ చేతులతో సైగలు చేసి ఎవరు ఎన్నో స్థానంలో ఉన్నారన్నది క్లియర్‌గా చూపించడం, డబ్బులు తీసుకుని రా అని చెప్పడం అందులో క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది. ఇక సోహెల్ 25 లక్షలతో బయటకు వచ్చాక ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

నెట్టింట వైరల్..
మెహబూబ్ చేతులతో సైగలు చేయడం, సోహెల్ అన్నీ దగ్గరుండి మరీ గమనించడం అందులో క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది. అభిజిత్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పడంతోనే సోహెల్ వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ మెహబూబ్ ఇచ్చిన హింట్ వల్లే 25 లక్షల డీల్‌కు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఎలాగూ అభిజిత్ విన్నర్ అవుతాడని తెలిసే అలా చేశాడని అందరూ తెగ ట్రోల్ చేశారు.

వీడియో చూసి షాక్..
అయితే తాజాగా మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అభిజిత్ ఈ వీడియోను చూసి షాక్ అయ్యాడు. ఆ వీడియోను ప్లే చేయించి చూపించారు. క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పారు. ఆ వీడియో చూసి అభిజిత్ చూసి షాక్ అయ్యాడనిపిస్తోంది. అయినా కూడా అభిజిత్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు.

అది వారిష్టం..
అలా మెహబూబ్ చెప్పినా కూడా మనం ఏం చేయలేం.. అది స్టార్ మా, ఎండోమోల్ షైన్ వారు చూసుకోవాలి.. అది వారి వ్యక్తిగతం.. డబ్బులు తీసుకోవాలా? వద్దా? అన్నది సోహెల్ వ్యక్తిగతం విషయం దాని మీద మనం కామెంట్ చేయకూడదంటూ అభిజిత్ ఎంతో హుందాగా స్పందించి మెచ్యూర్డ్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా గ్యాలరీ


Click it and Unblock the Notifications











