Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హారిక నాకు చెల్లెలితో సమానం.. ఎన్నో సార్లు చెప్పాను.. బాంబ్ పేల్చిన అభిజిత్
బిగ్ బాస్ షోలో ఏర్పడిన బంధాలు, మనకు కనిపించే సంబంధాలు అన్నీ కూడా బయటకు వచ్చాక అలాగే ఉంటాయని చెప్పలేం. అయితే బిగ్ బాస్ షోలో మనకు తెలియనివి ఎన్నో జరిగి ఉంటాయి. ఎందుకంటే 24 గంటల్లో మనకు చూపించేది కేవలం గంట మాత్రమే. అందులో బిగ్ బాస్ టీంకు నచ్చిన కంటెంట్ మాత్రమే వేస్తుంటారు. అలా ఎడిటింగ్ చేయడంతో కొన్ని బంధాలు దగ్గరైనట్టు.. ఇంకొన్ని దూరమైనట్టు మనకు కనిపిస్తాయి.
మొదటి నుంచి..
బిగ్ బాస్ షోలో ఫస్ట్ డే నుంచి కూడా అభిజిత్ హారికలు కలిసే ఉన్నారు. కనెక్షన్ గేమ్ ద్వారా బిగ్ బాసే ఆ ఇద్దరిని కలిపాడు. అలా మొదటి రోజు నుంచి వీరు కలిసే ఉన్నారు. మధ్యలో విబేధాలు వచ్చినా కూడా కలిసిపోయారు. లోపల ఈ ఇద్దరి క్యూట్ ఫ్రెండ్షిప్ను చూసి అందరూ ఎంతో ముచ్చట పడ్డారు. ఈ బంధానికి అభిక అంటూ పేరు పెట్టేశారు.
పెళ్లి కూడా అంటూ..
అయితే అభిక అంటూ విపరీతంగా ట్రెండ్ కావడంతో అభిజిత్ పేరెంట్స్, హారిక తల్లి కూడా ఈ బాండింగ్‌ను బాగానే ఇష్టపడ్డారు. హారిక తల్లి అయితే ఏకంగా పెళ్లి వరకు వెళ్లేసింది. వారిద్దరికి ఓకే అయితే అభిజిత్ వాళ్లింట్లో సరే అంటూ మాకేమీ ఇబ్బంది లేదంటూ చెప్పేసింది. అలా అభిజిత్ హారికల బంధం గురించి అందరూ ఒకలా ఆలోచిస్తుంటే.. అది అసలు అలాంటి బంధమే కాదని అభిజిత్ బాంబ్ పేల్చాడు.
చెల్లి అంటూ..
అయితే తాజాగా అభిజిత్ ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరికి దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు.. నీలాంటి ఓ చెల్లి ఉంటే బాగుండు అని హారికతో ఎన్నోసార్లు అన్నాను అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. అయితే బయటకు మాత్రం వేరేలా వచ్చింది అంటూ సదరు యాంకర్ తిరిగి ప్రశ్నించింది. సిస్టర్ లాంటిదానివి అని షోలో చాలాసార్లు చెప్పాను కానీ అది టెలికాస్ట్ చేయలేదేమో మరి అని అభిజిత్ అన్నాడు.
తెలిసి కూడా అలా చూపించాడా?
అయితే బిగ్ బాస్ మాత్రం ఆ రిలేషన్‌షిప్‌ను బయటకు వేరేలా ప్రొజెక్ట్ చేశాడా? అన్న అనుమానం కలుగుతోంది. మొత్తానికి ఇది మాత్రం అభిక ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్, క్యూట్ ఫ్రెండ్స్ అంతకు మించి అనుకుని ఆశపడుతున్న అభిక ఫ్యాన్స్.. ఇలా చెల్లి అని అభిజిత్ అనడంతో ఒక్కసారిగా షాక్ అయినట్టు కనిపిస్తోంది.