Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్యూట్ ఫోటోతో ఫిదా చేసేశాడు.. అభిజిత్ చిన్న నాటి ఫోటో వైరల్
బిగ్ బాస్ షోలో అభిజిత్ ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా ఎంతో హుందాగా ప్రవర్తించి.. చివరకు విజేతగా నిలిచాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా చలించకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అభిజిత్ కంటే ఎక్కువగా వాళ్ల అమ్మ ఫేమస్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన ఎపిసోడ్లో అభిజిత్ మదర్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
చివరి వరకు..
అభిజిత్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత వరకు ఒక్కసారిగా కన్నీరుపెట్టుకుంది లేదు. ఎక్కువగా ఎమోషనల్ కాకుండా కంట్రోల్ చేసుకోవడం అందరికీ బాగా నచ్చింది. ఎవ్వరు ఎలిమినేట్ అయినా కూడా, ఇంటి సభ్యులు వచ్చి పలకరించినా కూడా తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నాడు. చివరకు విజేతగా నిలిచాడు.
అభిజిత్ మదర్ అలా..
అభిజిత్ కోసం అతని తల్లి లక్ష్మీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టింది. వారం మొత్తం ఫ్యామిలీటచ్ ఇచ్చిన బిగ్ బాస్ అభిజిత్ కోసం వాళ్ల అమ్మను తీసుకొచ్చాడు. అలా వచ్చిన అభిజిత్ తల్లి తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. కొట్టుకోండి.. కొట్టుకుంటూనే మజా ఉంటుందని అభిజిత్ తల్లి చెప్పుకొచ్చింది. అలా ఆ సమయంలో అభిజిత్ తల్లి మాట్లాడిన మాటలతో ఫుల్ ఫేమస్ అయింది.
ఇంటర్వ్యూల్లోనూ..
ఇక బయట ఇంటర్వ్యూల్లోనూ అభిజిత్ గురించి మాట్లాడటం, బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అభిజిత్ గెలుస్తాడని అందరికంటే ముందుగానే అతని తల్లి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ షో గెలవడం ఎంతో అవసరమని కూడా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
బయటకు వచ్చాక..
అభిజిత్ బయటకు వచ్చాక అతని తల్లికి పెరిగిన ఫాలోయింగ్ చూసి అందరూ షాక్ అయ్యాడు. నా కంటే ఎక్కువగా మా అమ్మకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందట అని చెబుతూ షాక్ అయ్యాడు. అభిజిత్ సోషల్ మీడియాలో లైవ్‌కి వచ్చినా కూడా అందరూ అమ్మ గురించే అడిగేవారు.
తాజాగా ఆ ఫోటో..
మామూలుగా అభిజిత్ ఎక్కువగా ఫోటోలో దిగడంటూ ఆ మధ్య అతని తల్లి చెప్పుకొచ్చింది. అయితే తాజాగా అభిజిత్ ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశాడు. అందులో చిన్నతనంలో తనను ఎత్తుకున్న అమ్మ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో ఆ ఇద్దరూ కూడా వైరల్ అవుతున్నారు. చిన్న నాటి అభిజిత్‌ను చూసి అందరూ షాక్ అవుతున్నారు.