ఫినాలే ముందు పెద్ద తప్పు చేసిన అభిజీత్: షోలో ఇదే తొలిసారి.. మంచి ఛాన్స్ కోల్పోయాడు

తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. దీని వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలు చెడ్డ పేరును మూటగట్టుకోగా, చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు మాంచి ఫాలోయింగ్‌ను అందుకున్నారు. ఇలా.. కొన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపును.. షోలో పాల్గొనడం ద్వారా అందుకున్నాడు ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ అభిజీత్. అద్భుతమైన ఆట తీరుతో పాటు లవ్ ట్రాకులతో యమ పాపులర్ అయ్యాడతను. ఈ నేపథ్యంలో షోలో అభిజీత్ పెద్ద తప్పు చేశాడు. ఫలితంగా మంచి ఛాన్స్ కోల్పోయాడు. ఆ వివరాలు మీకోసం!

 ఇద్దరమ్మాయిల వల్లే ఫుల్ ఫేమస్

ఇద్దరమ్మాయిల వల్లే ఫుల్ ఫేమస్

హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు అభిజీత్. అయినా అతడికి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. దీనికి కారణం మొదటి ఎపిసోడ్ నుంచే లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకోవడమే. మొదట మోనాల్‌తో, ఆ తర్వాత దేత్తడి హారికతో ట్రాక్ నడుపుతూ హైలైట్ అవుతున్నాడు.

మాస్టర్ ప్లాన్లతో ఆకట్టుకున్న అభి

మాస్టర్ ప్లాన్లతో ఆకట్టుకున్న అభి

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరిలోనూ అభిజీత్ ప్రత్యేకం అని అనిపించుకున్నాడు. అందరిలా టాస్కుల్లో ఆరాట పడుతూ ఆడకుండా, బుర్రకు పని చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఎన్నో మాస్టర్ ప్లాన్లు వేసి గేమ్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఫలితంగా కొన్ని టాస్కుల్లో తన టీమ్‌కు విజయాన్ని అందించి ఔరా అనిపించాడు.

అతడే టార్గెట్... అదే కలిసొచ్చింది

అతడే టార్గెట్... అదే కలిసొచ్చింది

బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్లు ఎవరినైతే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారో.. వాళ్లపై ప్రేక్షకుల్లో సింపతీ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుత సీజన్‌లోనూ హౌస్‌మేట్స్ ఎక్కువగా అభిజీత్‌ను టార్గెట్ చేస్తున్నారు. టాస్కులు సరిగా ఆడడని, అందరితో కలవడని అంటూ నామినేట్ చేయడంతో అతడికే బాగా ప్లస్ అయింది.

టైటిల్ విన్నర్‌ అభీనే అంటున్నారు

టైటిల్ విన్నర్‌ అభీనే అంటున్నారు

తెలుగు రాష్ట్రాల్లో అభిజీత్ పేరు మారుమ్రోగిపోతోంది. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల వరకు అతడినే సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, అతడి అభిమానులు సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఫలితంగా తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాడు. దీంతో ఈ సారి టైటిల్ విన్నర్ అభిజీతే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫినాలే ముందు పెద్ద తప్పు చేసి

ఫినాలే ముందు పెద్ద తప్పు చేసి

ఫినాలే వీక్‌కు ముందు అఖిల్‌ను మినహా అందరినీ నామినేట్ చేసిన బిగ్ బాస్.. కొన్ని టాస్కులు ఇచ్చి వాటిలో గెలిచిన వారికి నేరుగా ప్రేక్షకుల నుంచి ఓట్లు అభ్యర్ధించవచ్చని చెప్పాడు. ఇప్పటికే మూడు టాస్కులు పూర్తవగా, వాటిలో ఆరియానా రెండు సార్లు, సోహెల్ ఒకసారి విజయం సాధించారు. ఈ క్రమంలోనే జరిగిన మరో టాస్కులో అభిజీత్ పెద్ద తప్పు చేశాడు.

Recommended Video

Allu Arjun’s Ala Vaikunthapurramuloo in Top Of Netflix's TOP 10 Most Watched Films Of 2020
 మంచి ఛాన్స్ కోల్పోయిన అభిజీత్

మంచి ఛాన్స్ కోల్పోయిన అభిజీత్

ఎప్పుడు టాస్క్ వచ్చినా.. ఆ లెటర్‌ను పదే పదే చదువుతూ ఉండే అభిజీత్.. తాజాగా ఇచ్చిన వినోదం టాస్కులో రూల్స్ బ్రేక్ చేశాడు. డ్యాన్స్ చేస్తూనే ఉండాలి అని, సాంగ్ గ్యాప్‌లో స్టేజ్‌పై కూర్చోకూడదని చెప్పాడు బిగ్ బాస్. కానీ, అభిజీత్ కూర్చున్నాడు. దీన్ని మోనాల్ గుర్తు చేయగా, జడ్జ్ అఖిల్ అతడిని టాస్క్ నుంచి తప్పించాడు. ఫలితంగా మంచి ఛాన్స్ మిస్సయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X