3 నెలలుగా కరువులో ఉన్నాం.. ఏదైనా చేయి బిగ్‌బాస్.. అభిజిత్, సొహెల్ రొమాంటిక్‌గా కోరిక చిట్టా
బిగ్‌బాస్ షో ముగింపుకు చేరుకొనే క్రమంలో ఇంటిలో కంటెస్టెంట్లపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇంకా మూడు వారాలు త్వరగా గడిచిపోతే బాగుండనే విషయాన్ని ఇంటి సభ్యులు తమ మాటల్లో ప్రస్తావించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామంటూ అభి, సోహెల్, హారిక మధ్య రొమాంటిక్ చర్చ జరిగింది. ఈ ముగ్గురి కోరికలు ఏమిటంటే..

బయటకు వెళ్లి కొన్ని ఎపిసోడ్స్ చూస్తా
బిగ్‌బాస్ తెలుగు షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత అర్జెంటుగా కొన్ని ఎపిసోడ్స్ చూడాలని ఉంది. కొన్ని విషయాలు తలచుకొంటే నాకే నవ్వు వస్తున్నది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు అంటూ అభిజిత్ అంటే.. నీవు ఎపిసోడ్స్ చూస్తావా? అంటూ సోహెల్ ప్రశ్నించాడు. అందుకు నీవు ఏం చేస్తావు అంటూ అభిజిత్ అడిగితే.. చాలా స్ట్రెస్‌లో ఉన్నాను. దానిని తల నుంచి దించేయాలని ఉంది అంటూ సైగ చేశాడు.

సోహెల్ 9pm ఎపిసోడ్ అంటూ
ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత 9pm షో కావాలా? అంటూ సోహెల్‌ను అభిజిత్ అడిగాడు. 9 తర్వాత అమ్మాయిలతో చాటింగ్ చేసే అలవాటును మరోసారి అభిజిత్ గుర్తు చేశాడు. దాంతో నాకు ఫుల్ రిలీఫ్ కావాలి. మంచిగా అంటూ సొహెల్ ఏదో చెప్పబోతుంటే.. నీవు మాట్లాడకు సొహెల్.. నా మూడ్.. మైండ్ కూడా ఎటో పోతుంది అంటూ అభిజిత్ అన్నాడు.

అభిజిత్‌కు టార్చర్ అంటూ
దాంతో హారిక జోక్యం చేసుకొంటూ... సోహెల్ నిన్ను చూసి.. అభిజిత్ కూడా ఊహల్లోకి వెళ్లిపోతున్నాడు అంటూ నవ్వుల్లో మునిగిపోయింది. అభిజిత్ టార్చర్ గురవుతున్నాడని అంటూ సోహెల్, హారిక పకపకా నవ్వుతూ ఉన్నారు. మూడు నెలలు ఎలా ఉన్నాను అనే ఫీలింగ్ అభిజిత్‌లో మొదలైంది అంటూ హారిక కామెంట్ చేసింది.
Recommended Video

కరువులో ఉన్నాం బిగ్‌బాస్ అంటూ
హారిక కామెంట్స్‌పై స్పందిస్తూ.. రాబోయే మూడు వారాలు నాకు ఎవరెస్టు పర్వతంలా కనిపిస్తున్నది అని అభిజిత్ అంటే.. బిగ్‌బాస్ కరువు కాలంలో ఉన్నాం. అందరూ కరువు కాలంలో ఉన్నారు బిగ్‌బాస్ అంటూ సోహెల్ నవ్వుల్లో మునిగిపోయాడు. దాంతో మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని బిగ్‌బాస్ అంటాడని అభిజిత్ కూడా నవ్వుల్లో మునిగిపోయాడు.


Click it and Unblock the Notifications











