For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పులిలా వేటాడాలి.. మగతనం అంటే అది.. మోనాల్‌పై దెబ్బకు దిమ్మతిరిగే అభిజిత్ గేమ్ ప్లాన్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 52వ రోజు వినోదంతోపాటు గొడవలు కూడా కనిపించాయి. టాస్క్‌లో భాగంగా ఎవరికి వారు తమ వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా అర్ధమైంది. ఈ సందర్భంగా మెహబూబ్ దిల్‌సేకు అభిజిత్ ఓ పిట్టకథను చెబుతూ కనిపించాడు. వేటాడటంలో పులి నైజం ఎలా ఉంటుందనే విషయాన్ని చెబుతూ..

    ట్రయాంగిల్ లవ్ గేమ్‌లో

    ట్రయాంగిల్ లవ్ గేమ్‌లో

    అఖిల్, అభిజిత్, మోనాల్ గజ్జర్ మధ్య ట్రయాంగిల్ లవ్‌తో ముగ్గురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆ సమయంలో ఆ ట్రయాంగిల్ రేసును నుంచి అభిజిత్ తప్పుకొని చాలా కామ్‌గా ఉంటూ కనిపించారు. మోనాల్, అఖిల్ తీరును అవసరమైనప్పుడు అభిజిత్ ఘాటుగా విమర్శిస్తూ, వేలెత్తి చూపుతూ గేమ్ ప్లాన్‌ను అమలు చేసినట్టు కనిపించాడు.

    బిగ్‌బాస్‌లో నా సీరియస్ గేమ్ ప్లాన్

    బిగ్‌బాస్‌లో నా సీరియస్ గేమ్ ప్లాన్

    వాస్తవంగా నీకు విషయం చెబుతాను. బిగ్‌బాస్‌లో నా సీరియస్ గేమ్ ప్లాన్ ఇది. జీవితంలో పులిలా ఉండాలని అందరూ అంటుంటారు. మగాడంటే పులిలా ఉండాలి. పులి అంటే చాలా ఉద్రేకంగా ఉంటుంది. అటాకింగ్‌గా కనిపిస్తుంది. భయపడదు. ఎదురుగా ఏదైనా కనిపిస్తే పట్టేస్తుంది. పంజా కొట్డడంలో దానికి మించిన జంతువు ఉండదని అందరూ చెబుతుంటారు అని మెహబూబ్‌కు చెబుతూ కనిపించారు.

    అదను చూసి వేటాడటం పులి లక్షణం

    అదను చూసి వేటాడటం పులి లక్షణం

    అయితే పులి అదను చూసి పంజా విసరడం, వేటాడం దాని లక్షణం. పులి గేమ్ వెయిటింగ్ గేమ్. పులి కాసేపు వేచి చూసి ఆ తర్వాత వేట ప్రారంభిస్తుంది. పులిలా మగతనం చూపించు.. పులిలా బయటకు వచ్చి పోరాడు అనడం తప్పు. పులి అంటే అదను చూసి వేటాడం అంటూ అభిజిత్ పేర్కొన్నారు.

    Bigg Boss Telugu 4 : Episode 13 PROMO Review | తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్, హిందీ బిగ్‌బాసా?
    డిస్కషన్ పెడితే కంపు కావడం..

    డిస్కషన్ పెడితే కంపు కావడం..

    ఇంట్లో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వేచి చూస్తే నీకు వాటికి సమాధానాలు దొరుకుతాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నలుగురితో కలిసి డిస్కషన్ పెడితే కంపు తయారవుతుంది. ఇలాంటి విషయాలు మోనాల్‌తో జరిగిన సంఘటనలతో క్లారిటీ వచ్చింది. అందుకే నేను చాలా ఓపికగా ఎదురుచూసి, సంయమనంతో గేమ్ ప్లాన్‌తో వెళ్తున్నాను అంటూ మెహబూబ్‌కు చెప్పడం కనిపించింది.

    English summary
    Bigg Boss Telugu 4's 8th week luxury budget task update: BB Day care task generates hillarious comedy. Avinash, Ariana Glory, Amma Rajasekhar, Mehaboob, Harika dettadi become kids. Neol, Abijeet, Sohel, Monal become care takers. Ariana Glory and Syed Sohel Ryan wins the title
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X