twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ముగ్గురిలో ఆమె కోడలైతే ఇష్టమే.. సరైన జోడి ఆ కంటెస్టెంటే.. అభిజిత్ తల్లి కామెంట్స్

    |

    బిగ్‌బాస్ ఇంటిలో ఉత్తమ ప్రదర్శన ఇస్తున్న కంటెస్టెంట్లలో అభిజిత్ ఒకరు. ఇంటిలో అభిజిత్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ చాలానే కనిపిస్తున్నది. ఇంటిలో ఎక్కువగా రొమాన్స్ పంచుతున్న అభిజిత్‌ గురించి స్వయంగా హోస్ట్ నాగార్జునే కితాబులిస్తున్నారు. ఇలాంటి క్రమంలో అభిజిత్ గురించి తల్లి వెల్లడించిన అభిప్రాయాలు ఇవే...

    అభిజిత్ జంతు ప్రేమికుడు

    అభిజిత్ జంతు ప్రేమికుడు

    బిగ్‌బాస్ హౌస్‌లో అభిజిత్ స్వయంగా చెప్పినట్టు నా కుమారుడు జంతు ప్రేమికుడు. జంతువులకు ఏదైనా అయితే తట్టుకోలేడు. ఇంటిలో తనకు ఓ పెంపుడు కుక్కు కూడా ఉంది. బయట ఏదైనా జంతువు గాయపడితే ఇంటికి తీసుకు వచ్చి వాటిని సంరక్షిస్తాడు. ఓ సారి ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఒంటెను వేధిస్తుంటే.. దాని యజమానికి కొట్టాడు. పేపర్లో వస్తే ఆ విషయం తెలిసింది అంటూ అభిజిత్ తల్లి వెల్లడించింది.

    అభిజిత్‌కు అఫైర్లు లేవు

    అభిజిత్‌కు అఫైర్లు లేవు

    ఇక ఇంటిలో వరల్డ్ ఫేమస్ లవర్‌ అనిపించుకొన్న అభిజిత్‌కు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తాను లవ్ మ్యారేజ్ చేసుకోడు. మేము ఎన్నో సార్లు అడిగాం. ఎమైనా అఫైర్ ఉందా అంటే లేదని చెప్పాడు. బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు కూడా అడిగితే అలాంటిది లేదు అని చెప్పాడు. పెద్దలు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకొంటానని చెప్పాడని అభిజిత్ తల్లి పేర్కొన్నారు.

    ముగ్గురి క్వాలిటీస్ ఉన్న అమ్మాయైతే ఓకే

    ముగ్గురి క్వాలిటీస్ ఉన్న అమ్మాయైతే ఓకే

    బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు కోడలు అయితే ఇష్టపడుతారనే ప్రశ్నకు.. అరియానా, హారిక, మోనాల్ గజ్జర్‌లోని ముగ్గురు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే అభిజిత్‌కు బాగుంటుందనే తన ఆలోచన అని చెప్పారు. ముగ్గురిలో ఉన్న క్వాలిటీస్‌‌తో అమ్మాయి అభిజిత్‌కు భార్యగా అయితే ఒకే అని ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు.

    అభిజిత్‌కు హారిక సరైన జోడి

    అభిజిత్‌కు హారిక సరైన జోడి

    అయితే మోనాల్, హారిక, అరియానాలో ఎవరైతే బాగుంటుందని అనుకొంటున్నారు అనే ప్రశ్నకు తప్పనిసరిగా జవాబివ్వాలంటే.. అభిజిత్‌కు హారిక సరిపోతుంది. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. వారిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. కాబట్టి హారిక అయితే అభిజిత్‌కు సరైన జోడి అనే అభిప్రాయం కలుగుతున్నదిని తల్లి ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.

    టాప్ 3లో అభిజిత్ ఉంటాడు..

    టాప్ 3లో అభిజిత్ ఉంటాడు..

    అలాగే టాప్‌ 5లో అభిజిత్ తప్పుకుండా ఉంటారు. టైటిల్ గెలువడానికి బలమైన కంటెస్టెంట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక టాప్ 3లో అభిజిత్, హారిక, అరియానా ఉండే అవకాశం ఉంది. అభిజిత్‌ గెలువడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అభిజిత్ గెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని తల్లి వ్యక్తం చేశారు.

    English summary
    Abijeet Duddala is top performer in the house. He has world famous lover image in the house. On this note, Abijeet mother She expressed her love on his son and told that if you ask me, Harika will be best pair for Abijeet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X