మేము ఇంట్లో రోబోలా ఉంటాం.. అభిజిత్ తల్లి ఎమోషనల్..క్లాస్ పీకిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేను అంగరంగ వైభవంగా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అందర్ని వేదికపైకి రప్పించి స్పెప్పులు వేయించారు. అనంతరం ప్రతీ ఇంటి సభ్యుడితో మాట్లాడారు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌కు ముందు ఆ తర్వాత తమ అనుభవాలను పంచుకొన్నారు. ఆ తర్వాత నేరుగా ఇంటిలోని టాప్ కంటెస్టెంట్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

టాప్ 5 కంటెస్టెంట్లు కేరింతలతో
ఇంటిలోని టాప్ 5 కంటెస్టెంట్లు తమదైన శైలిలో డ్యాన్స్‌లతో అలరించారు. అభిజిత్, అఖిల్, సోహెల్, అరియానా, దేత్తడి హారిక తమదైన డ్యాన్స్‌లతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత వేదికపైన ఉన్న నాగార్జునతో మాట్లాడారు. నాగ్ కనిపించగానే ఇంటిలోని సభ్యులందరూ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను పరిచయం చేశారు.

ఐ లవ్ యూ అమ్మా..
బిగ్‌బాస్ తెలుగు ఫైనల్ కార్యక్రమంలో అభిజిత్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ మామ్ అంటూ సంతోషంలో మునిగిపోయాడు. ఐ లవ్ యూ మై బాయ్.. మా అబ్బాయి బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లిన తర్వాత కంప్లీట్ మ్యాన్ అయిపోయాడు అంటూ అభిజిత్ తల్లి ఎమోషనల్ అయ్యారు.

ఇంట్లో మేము రోబోలా...
అయితే మా ఇంట్లో ఇలా మాట్లాడుకోవడం ఉండదు. ఐ లవ్ చెప్పుకోవడం ఉండదు. మేమంత రోబోట్స్‌లా ఉంటాం. ఇంట్లో ఎమోషన్స్ షేర్ చేసుకోం. మాకు అలవాటు లేదు అంటూ అభిజిత్ చెప్పడంతో నాగార్జున జోక్యం చేసుకొన్నారు.

ఇంటి సభ్యులతో ఎమోషన్స్ పంచుకోవాలి
అభిజిత్ మాటలకు నాగార్జున అడ్డుపడుతూ.. ఎమోషన్స్ అనేవి ఫ్యామిలీ మెంబర్స్‌తో పంచుకోవాలి. ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కుటుంబ సభ్యులతో పంచుకొవాలి. అదే మనకు బలం. కాబట్టి ఇంట్లోని వారితో కనెక్ట్ కావాలి అంటూ అన్నారు.


Click it and Unblock the Notifications











