Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హరికకు అరుదైన గిఫ్టు.. కోడలు లాంటి పిల్లకు అభిజిత్ తల్లి ఏం పంపారంటే...
బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళీ పండుగ సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్‌లో ఇంటి సభ్యులకు గిఫ్టులు అందించే కార్యక్రమాన్ని హోస్ట్ నాగార్జున పెట్టారు. అయితే గిఫ్టులు అందుకోవాలంటే బిగ్‌బాస్ చెప్పే గేమ్‌లో విజయం సాధించాలి. ఆ క్రమంలో హారికకు ఓ గేమ్ పెట్టారు. ఆ గేమ్ కోసం హారికను ఇద్దరు కంటెస్టెంట్ల సహాయం తీసుకోవచ్చని చెబితే.. అందుకు రంగంలో దూకారు. ఆ సందర్భంగా తనకు వచ్చిన అరుదైన గిఫ్టు ఏమిటంటే...
అభిజిత్, లాస్య సహయంతో
తనకు కేటాయించిన గేమ్ కోసం యాంకర్ లాస్యను, అభిజిత్‌ను హారికను ఎంచుకొన్నారు. గేమ్ ప్రకారం వెల్ ప్రో జాకెట్‌ను లాస్య తొడుక్కోవాలి. ఆ జాకెట్‌కు అతుక్కొనేలా బంతిని అభిజిత్ విసిరి కొట్టాలి. 1 నిమిషంలో 15 బంతులు ఆ జాకెట్‌కు అతుక్కొనేలా కొడితే గిఫ్టు లభిస్తుందని చెప్పారు.
హారికకు విజయం తెచ్చిపెట్టిన..
దాంతో హారిక గేమ్ మొదలుపెట్టింది. లాస్య వెల్ప్రో జాకెట్ తొడుగుకొంటే.. అభిజిత్ బంతులు దానికి చిక్కేలా కొట్టాడు. అలా 15 బంతులకుపైగా అభిజిత్ కొట్టడంతో హారిక విజయం సాధించింది. అయితే 15 కంటే ఎక్కువ కొడితే డిస్క్వాలిఫై అంటూ నాగార్జున ఝలక్ ఇచ్చాడు. దాంతో అభిజిత్ కంగుతిని వెంటనే వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు.
హారికకు రెండు గిఫ్టులు
బాల్ త్రోయింగ్ గేమ్‌లో హారిక విజయం సాధించడంతో నాగార్జున గిఫ్టు అందించాడు. ఆ గిఫ్టు ఎవరు ప్రజెంట్ చేశారని అడిగితే.. అభిజిత్ అంటూ హారిక సమాధానం చెప్పింది. అయితే ఆ గిఫ్టులో ఏమున్నాయనే ఆతృతతో అందరూ ఎదురు చూశారు. అయితే ఒకటి అభిజిత్ పంపించగా.. రెండోది యాంకర్ లాస్య పంపించి ఆశ్చర్యంలో ముంచెత్తారు.
సున్నుండలు.. డ్రస్ గిఫ్టులుగా
హారికకు లభించిన గిఫ్టుల్లో సున్నండలు ఉండలు.. అలాగే ఒక డ్రస్ కూడా ఉంది. సున్నుండలు అభిజిత్ అమ్మ పంపిస్తే. డ్రస్ మాత్రం లాస్య పంపించింది. దాంతో థ్యాంక్యూ అంటూ ఇద్దరిని కౌగిలించుకొన్నది. దాంతో ఆనందంలో మురిపిపోతూ థ్యాంక్యూ అంటీ అంటూ అభిజిత్ తల్లికి ధన్యవాదాలు చెప్పింది.
కమల్ హాసన్ చేతుల మీదుగా సేవ్
ఇక రెండు గిఫ్టులు రావడంపై హారికతో నాగార్జున మాట్లాడుతూ.. నిన్న కమల్ హాసన్ చేతుల మీదుగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యావు. ఇప్పుడు రెండు గిఫ్టులు అందుకున్నావు.. సూపర్ అంటే నాగార్జున అంటే.. అవును సార్.. డబుల్ బొనాంజా అంటూ హారిక సంతోషంలో మునిగిపోయారు.