నా మీద ప్రేమ ఉందా? అంత మాట అంటావా? అఖిల్‌ ముందే మోనాల్‌ను కసురుకొన్న అభిజిత్

బిగ్‌బాస్ ఇంటిలో 53వ రోజు కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సమయంలో అభిజిత్‌తో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి మోనాల్ ప్రతిపాదన తీసుకొచ్చింది. నీతో కాసేపు మాట్లాడాలని అనుకొంటున్నాను. మన మధ్య ఉన్న ఇష్యూస్‌ను క్లియర్ చేసుకోవాలనుకొంటున్నాను అని మోనాల్ చెప్పింది. అయితే అలాంటి చర్చ వద్దు.. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అలానే ఉండనివ్వు అని అభిజిత్ అంటే..లేదు నీవే మాట్లాడు.. నేను ఒక్క మాట కూడా అనను.. నేను మాత్రమే వింటాను అంటూ మోనాల్ చెప్పింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య 54వ రోజు ఈ చర్చ ఎలా సాగిందంటే..

నన్ను మ్యానుపులేటర్ అంటావా?

నన్ను మ్యానుపులేటర్ అంటావా?

మోనాల్‌తో అభిజిత్ మాట్లాడుతూ.. నీవు నన్ను మ్యానుపులేటర్ అని ఎలా అంటావు అని నిలదీశాడు. నీవు నేను తప్పు చేశావని అంటే.. నేను తప్పు చేయలేదని అంటాను. నేను ఏదైనా తప్పు చేస్తే. నీ పట్ల మరో విధంగా వ్యవహరిస్తే.. నీవు డైరెక్ట్‌గా వచ్చి చెప్పలేదు. వేరే వ్యక్తితో అంటే వాళ్లు వచ్చి నాకు చెప్పితే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అంటూ అభిజిత్ భగ్గుమన్నాడు.

నా మీద ప్రేమ ఉంటే..

నా మీద ప్రేమ ఉంటే..

నా మీద ప్రేమ ఉన్నందుకు, నా మీద ఇష్టం ఉన్నందుకు, నా మీద కేర్ ఉన్నందుకు నా వద్దకు వచ్చి నీవు చెప్పలేదు. నేను చెప్పకపోతే.. వేరే వాళ్లు చెబుతారనే కనీసం ఆలోచించవా? అని అభిజిత్ అంటే.. అందుకే నేను వచ్చి నీతో చెప్పాను అంటూ మోనాల్ సమాధానం ఇచ్చింది. అయితే మరొకరు వచ్చి చెప్పిన తర్వాత నాకు నీవు వచ్చి చెబుతావా అంటూ అభిజిత్ క్లాస్ పీకాడు.

నీ బర్త్ డే రోజున చాలా కోపంగా

నీ బర్త్ డే రోజున చాలా కోపంగా

నీ బర్త్ డే రోజున నేను చాలా కోపంతో ఉన్నాను. అయినా నేను వచ్చి దాని విషయంపై నీకు వివరణ ఇచ్చాను. ఆ విషయంపై నీకు అంత కోపం వచ్చిందా అంటూ అభిజిత్‌ను మోనాల్ కూల్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే నామినేషన్ ప్రక్రియలో అఖిల్ మోనాల్ ప్రస్తావన తీసుకురావడంతో జరిగిన గొడవపై అభిజిత్ పాయింట్ లేవదీశాడు. నేనంటే నీకు ఇష్టమని చెప్పావు. ఆ తర్వాత కూడా నాగార్జున సార్ ముందు.. అఖిల్‌ది, నాది తప్పు అని ఎలా చెబుతావు అంటూ నిలదీశాడు.

నాగార్జున సార్ ముందు..

నాగార్జున సార్ ముందు..

మోనాల్‌ టాపిక్‌ను మాట్లాడాలనుకొంటే ఆమె పర్మిషన్ తీసుకొని మాట్లాడండి అని నాగ్ సార్ చెప్పినప్పుడు.. అసలు ఏం జరిగిందో చెప్పేవాడిని. అయితే నిన్ను మళ్లీ మధ్యలోకి తీసుకొచ్చి టాపిక్‌గా మార్చడం ఇష్టం లేకనే నేను మౌనంగా ఉన్నా. అందుకే నన్ను నేను డిఫెండ్ చేసుకొన్నాను. నీవు చేసిన కామెంట్‌తో చాలా హర్ట్ అయ్యాను అంటూ అభిజిత్ క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
 మోనాల్, అభిజిత్ మధ్య అఖిల్ ఎంట్రీ

మోనాల్, అభిజిత్ మధ్య అఖిల్ ఎంట్రీ

అభిజిత్, మోనాల్ మధ్య డిస్కషన్ సాగుతున్న సమయంలో వారి మధ్య అఖిల్ ఎంట్రీ అయ్యాడు. ఆ రోజు కూడా ఇలా కూల్‌గా మాట్లాడితే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. అప్పుడు ఆ టోన్ మరో విధంగా ఉంది. కాబట్టే మోనాల్ హర్ట్ అయింది అంటూ అఖిల్ ఏదో చెప్పబోతే.. కాలమే కొన్నింటికి సమాధానం చెబుతుంది. కాబట్టి నేను మోనాల్‌ గురించి తప్పుగా మాట్లాడలేదు. అందుకే క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు అంటూ అభిజిత్ తెగేసి చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X