అప్పుడు అఖిల్‌ది తప్పు అని.. నాగ్ సార్ ముందు నాది తప్పంటావా? మోనాల్‌ను దుమ్ముదులిపిన అభిజిత్

ఐదోవారం నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల్లో అందరి మధ్య గట్టి చిచ్చు పెట్టింది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్ మధ్య భారీ గొడవకు దారి తీసింది. ఇంటిలో ఒకరి ముఖాలు మరొకరు చూసుకోలేని విధంగా మారింది. ఈ క్రమంలో ఐదో వారాంతం ఎపిసోడ్‌లో ప్రధానంగా ఈ విషయంపై హోస్ట్ నాగార్జున చర్చపెట్టారు. అభిజిత్, అఖిల్‌ను నాగార్జున నిలదీయడం తెలిసిందే. ఈ క్రమంలో మోనాల్‌కు అభిజిత్ గట్టిగా క్లాస్ తీసుకొన్నారు. ఆ వివారాల్లోకి వెళితే...

మోనాల్ పర్మిషన్ లేకుండా మాట్లాడుతారా?

మోనాల్ పర్మిషన్ లేకుండా మాట్లాడుతారా?

ఐదోవారాంతంలో నాగార్జున వేదికపై నుంచి మాట్లాడుతూ.. ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమె గురించి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అంటూ మోనాల్‌ను ఉద్దేశించి అభిజిత్, అఖిల్‌ను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా అఖిల్, అభిజిత్ తమ సమాధానాలను ఇచ్చిన ప్పటికీ నాగ్ సంతృప్తి చెందలేదు.

 అఖిల్, అభిజిత్‌కు క్లాస్ పీకిన నాగ్

అఖిల్, అభిజిత్‌కు క్లాస్ పీకిన నాగ్

ఒక అమ్మాయి నెత్తి నోరు కొట్టుకొంటూ నా పేరు తీయకండి అని అరుస్తుంటే.. గట్టిగా అభ్యర్థిస్తుంటే ఎవరూ వినిపించుకోకుండా మోనాల్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదు అని నాగార్జున అన్నారు. మోనాల్‌తో నాగ్ మాట్లాడుతూ ఇద్దరిలో ఎవరిది తప్పు అని అడిగితే అభిజిత్, అఖిల్‌ది ఇద్దరిది తప్పే అని అని చెప్పింది.

ఇద్దరిది తప్పే అంటూ మోనాల్ చెప్పడంతో

ఇద్దరిది తప్పే అంటూ మోనాల్ చెప్పడంతో

మోనాల్‌ చెప్పిన విషయాన్ని ఆధారంగా చేసుకొని నాగార్జున ఇంటి సభ్యులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నామినేషన్ గానీ, ఇతర విషయాల్లో గానీ తమకు సంబంధించిన విషయం కాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడాలని భావిస్తే.. వారి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకుండే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నాగ్ హెచ్చరించారు.

మోనాల్, అభిజిత్ మధ్య మరోసారి వాగ్వాదం

మోనాల్, అభిజిత్ మధ్య మరోసారి వాగ్వాదం

ఇక ఐదో వారాంతం తర్వాత మళ్లీ అదే విషయంపై గట్టిగానే మోనాల్ గజ్జర్, అభిజిత్ మధ్య వాగ్వాదం జరిగినట్టు తాజా ప్రోమో వెల్లడించింది. బెడ్ రూమ్‌లో నాతో మాట్లాడుతూ అఖిల్‌ది తప్పు ఉందని అన్నావు.. నాగ్ సార్ ముందు ఇద్దరిది తప్పు ఉందని అంటావా? ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తావా? ఒక్క అమ్మాయి విషయం అంటూ ఏదో చెప్పబోతుంటే.. దీనిని ఒక యువతి సమస్యగా నిలబెట్టకు అంటూ అభిజిత్ నిలదీశాడు.

అఖిల్‌కు నీ మీద అంత ప్రేమ ఉంటే..

అఖిల్‌కు నీ మీద అంత ప్రేమ ఉంటే..

నీ మీద అఖిల్‌కు అంత ప్రేమ ఉంటే.. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ఎత్తాలి. ఒక విషయంలో ఒక తీరుగా ఉంటావు. నీకు సూట్ కాకపోతే మరో విధంగా ఉంటావు అని మోనాల్‌కు క్లాస్ పీకుతూ కనిపించాడు. దాంతో మోనాల్ కన్నీటి పర్యంతమైంది. కంటి నుంచి నీరు కారుతుండగా తుడుచుకొంటూ కనిపించింది. సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌తో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X