మోనాల్ మోసాన్ని బయపెట్టిన అభిజిత్.. మగాడిగా అలా నిలబడ్డా.. నాగ్ సార్‌కు చెప్పలే.. హారికపై అసహనం

అభిజిత్‌కు హారిక దేత్తడికి మధ్య మోనాల్ గజ్జర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరిగింది. 12వ వారం దెయ్యం టాస్క్ సందర్భంగా మోనాల్‌ను అభిజిత్ డేటింగుకు తీసుకుపోక పోవడంపై కన్ఫెషన్ రూమ్‌లోకి కెప్టెన్ హారిక పిలిచి నాగ్ క్లాస్ పీకిన విషయాన్ని అభిజిత్‌కు వివరించింది. ఈ క్రమంలో అభిజిత్ ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టారు. అదేమిటంటే..

 అఖిల్, సోహెల్ టాస్క్ ఆడుతుండగా..

అఖిల్, సోహెల్ టాస్క్ ఆడుతుండగా..

అఖిల్, సోహెల్ ఉయ్యాల టాస్క్ కొనసాగుతుండగా.. టాస్క్‌ను టాస్క్‌లానే ఆడాలి. వ్యక్తిగతం తీసుకోవద్దని నాగ్ సార్ చెప్పారు. అభిజిత్‌ను టాస్క్ ఆడించడంలో కెప్టెన్‌గా నీవు ఫీలయ్యావని వీడియోలు చూపించి నన్ను మందలించాడు. ఆ విషయంలో నీవు ఫెయిల్ అయ్యావు అంటూ నన్ను దారుణంగా నిందించాడని అభిజిత్‌తో హారిక చెప్పింది.

మోనాల్‌తో డేటింగ్‌కు వెళ్లకపోవడానికి అదే కారణం

మోనాల్‌తో డేటింగ్‌కు వెళ్లకపోవడానికి అదే కారణం

అయితే మోనాల్‌తో డేటింగ్‌కు పోకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. ఆ సమయంలో మోనాల్ నాకు ఓ మాట చెప్పి మోసగించింది. అందుకే ఆమెతో నేను డేటింగ్‌కు వెళ్లలేదు అని చెప్పాడు. ఓ సందర్భంలో మోనాల్ మనసులో ఉన్న A ఎవరు అని నాగ్ సార్ అడిగిన తర్వాత నేను చాలా కూల్‌గా ఆమె నుంచి సమధానం రాబట్టేందుకు ప్రయత్నించాను.

నా మనసులో నీవే అంటూ

నా మనసులో నీవే అంటూ

నాగ్ సార్ ఎపిసోడ్ తర్వాత మోనాల్‌ను పిలిచి.. వాస్తవంగా నీ మనసులో ఉన్నది ఎవరు అంటే.. నీవేనని నాకు చెప్పింది. నా మనసులో నీకే స్థానం ఉంది అని క్లారిటీగా చెప్పింది. ఆ తర్వాత నాకు చెప్పిన విషయంపై యూటర్న్ తీసుకొన్నది. అందుకే నేను ఆమెకు దూరంగా ఉన్నాను అని అభిజిత్ చెప్పాడు.

మోనాల్ మాటలను నాగ్ సార్‌కు చెప్పలేదు

మోనాల్ మాటలను నాగ్ సార్‌కు చెప్పలేదు

మోనాల్ చెప్పిన విషయాలను నాగ్ సార్ అడిగినప్పటికీ నేను చెప్పలేదు. ఎందుకంటే అమ్మాయిని బద్‌నాం చేయకూడదని భావించా. నేను ఎన్ని బాధలు పడినా మోనాల్ మాటలను ఎక్కడ చెప్పలేదు. నాగ్ సార్ అడిగినా నేను చెప్పకోవడానికి అదే కారణం. సారీ అంటూ ఆ విషయాన్ని దాటవేశాను. ఆ విషయంలో నేను మగాడిలా నిలబడ్డాను అంటూ అభిజిత్ పేర్కొన్నాడు.

 ఇంగ్లీష్‌లో మాట్లాడమంటూ అంటూ హారిక అసహనం

ఇంగ్లీష్‌లో మాట్లాడమంటూ అంటూ హారిక అసహనం

అయితే అభిజిత్ ఎమోషనల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. తెలుగు.. తెలుగు అంటూ హారిక హెచ్చరించింది. అయితే నేను చెప్పేది విను. నేను ఒక విషయాన్ని ఎమోషనల్‌గా చెబుతుంటూ ఉంటే నీవు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. నా స్థాయికి ఎదగాలంటే ఇంకో ఐదేళ్లు కావాలి అంటూ అక్కడి నుంచి లేచిపోయాడు. ఒకవేళ నేను ఇంగ్లీష్‌లో మాట్లాడితే బిగ్‌బాస్ నాకు శిక్ష వేస్తాడనే విషయం నాకు తెలియదా అంటూ అభిజిత్ ఫైర్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X