గాడిద కూడా పహిల్వాన్.. అతడి అండ ఉంటే అంటూ హారిక, మోనాల్‌పై అభిజిత్ సెటైర్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 75వ రోజున హారిక దేత్తడి ఇంటి కెప్టెన్ అయింది. కెప్టెన్ కావడానికి మోనాల్ 100 శాతం సపోర్ట్ ఇవ్వడంతో ఎన్నో రోజుల నుంచి కంటున్న కల నిజమైంది. హారికను భుజాలపై ఎత్తుకొని చాలా సేపు మోయడంపై అభిజిత్ సెటైర్లు వేశాడు. కెప్టెన్సీ టాస్క్ తర్వాత హారికతో అభిజిత్ సంభాషణ ఆసక్తిగా సాగింది. వారి మధ్య జరిగిన సంభాషణలో మోనాల్, లాస్య కూడా భాగమయ్యారు. కెప్టెన్సీ టాస్క్ గురించి అభిజిత్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..

అభిజిత్‌కు, లాస్కకు నచ్చడం లేదు
కెప్టెన్‌గా గెలిచిన తర్వాత హారిక దేత్తడి, యాంకర్ లాస్య, మోనాల్ గజ్జర్, అభిజిత్ ఇంటిలోని లాన్‌లో కూర్చొని పిచ్చాపాటిగా మాటల్లోకి దిగిపోయారు. కెప్టెన్‌గా నన్ను ఇలా చూడటం లాస్య, అభిజిత్‌కు నచ్చడం లేదు. ఎంత కష్టపడి కెప్టెన్ అయ్యాను అంటే.. మాకు హ్యాపీనే అంటూ లాస్య సమాధానం ఇచ్చింది. అయితే హారిక మాటలకు అడ్డుపడుతూ అభిజిత్ సైటర్లు వేయడంతో నవ్వుకొన్నారు.

హారిక జోక్యం చేసుకొంటూ..
మోనాల్ ఎంత పని చేస్తివి.. ఎంత పని చేస్తివి అంటూ హీరో రాజశేఖర్ డైలాగ్ కొడుతూ ముసిముసిగా నవ్వుకొన్నాడు. దాంతో హారిక జోక్యం చేసుకొంటూ మధ్యలో మోనాల్ వెళ్లి అఖిల్‌ను ఎత్తుకోవాల్సి ఉండేది. అప్పుడు ఆయన ఫుల్ ఖుషీ అవుతుండేనేమో అని అభిజత్ పేర్కొన్నారు.

హిందీలో అభిజిత్ కవిత చెబుతూ
అంలోనే అభిజిత్ హిందీలో కవిత చెప్పాడు. ఖుదా మెమర్బానీ.. గధా బీ పహిల్వాన్ (దేవుడి కృప ఉంటే.. గాడిద కూడా పహిల్వాన్ అవుతుంది). ఎప్పుడన్నా విన్నావా? అని అభిజిత్ అంటే.. గధా (గాడిద) ఎవరు అని హారిక అడిగింది. అయితే మీరు అర్ధం చేసుకోండి. గాడిద ఎవరనేది మీకే బాగా తెలుస్తుంది. అంత అర్థం చేసుకొనే తెలివి మీకు ఉంది అంటూ అభిజిత్ కామెంట్ శాడు.

జోకు వేస్తే జోకుగా తీసుకో
అభిజిత్ మాటలపై హారిక చిర్రుబుర్రులాడితే.. నేను ఏదో జోక్ వేస్తే దాన్ని జోక్‌గా తీసుకోలేదా? ఆమె రెండు ఫీట్ల పొడవు జోకులేస్తే.. నేను యాపిల్ బాక్స్ అంతా జోక్ వేశాను అని అభిజిత్ అన్నాడు. అయితే ఇలా కష్టపడి నేను కెప్టెన్ అయితే నీకు నొప్పి ఏమిటి? అని హారిక నిలదీసింది. అయితే నాకు నొప్పి కాదు.. ఆనందం అంటూ అభిజిత్ సమాధానం ఇచ్చాడు.
Recommended Video

ఈ జోక్‌ను గుర్తుపెట్టుకో అభిజిత్ అంటూ
మరోసారి ఎప్పుడైనా నేను జోక్ వేసినప్పుడు నీవు కోపం తెచ్చుకొంటే అప్పుడు చెబుతాను. ఇది గుర్తుంచుకో. ఇది నేను గుర్తుపెట్టుకొంటాను. మళ్లీ టూ ఫీట్ జోక్ అని ఏదైనా అంటే అప్పుడు నీ సంగతి చెబుతాను అంటూ హారిక కామెంట్ చేసింది. దాంతో అభిజిత్ సరే.. జోక్ వేసుకో అంటూ ఆ చర్చను అక్కడితో ముగించారు.


Click it and Unblock the Notifications











