డైరెక్టర్ నువ్వా? నేనా?.. అవినాష్‌కు అభిజిత్ చురకలు..

బిగ్‌బాస్ ఇంటిలో బ్లాక్ బస్టర్ టాస్క్‌తో సినిమా షూటింగ్ సందడి సందడిగా మారింది. షూటింగు సమయంలో తమ క్రియేటివిటిని బయట పెట్టుకొనేందుకు ఎవరికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్క్రిప్టు రైటర్ అవినాష్‌కు అభిజిత్ చిన్న పాటి ఝలక్ ఇచ్చారు.

షూటింగులో భాగంగా అరియానాపై అభిజిత్, కెమెరామెన్ నోయల్ సీన్ ఓ సీన్ షూట్ చేస్తున్నారు. అంతలో అవినాష్ మధ్యలో దూరి అరియానా జుట్టును సవరించే ప్రయత్నం చేశారు. దాంతో అరియానాను మేము అందంగా చూపిస్తాం. నీవేం బాధపడకు. మా డీవోపి నోయల్ ఆమెను బాగా చూపిస్తారు అంటూ అభిజిత్ కామెంట్ విసిరారు.

Abijeet Duddala satires on Jabardasth Avinash in Blackbuster task of Bigg Boss Telugu

అయితే ఫ్రీజ్ అవ్వాలని అరియానాకు చెబుతున్నానంటూ అభిజిత్ మాటలకు ఏదో చెప్పబోయాడు. దాంతో డైరెక్టర్ నేను అంటూ అభిజిత్ అవినాష్‌కు చిన్న ఝలక్ ఇచ్చారు. అరియానాను అందంగా చూపించండి అంటూ నోయల్‌కు అభిజిత్ చెబితే.. నేను ఇప్పటికే మంచి లైటింగ్‌ను సెట్ చేశాను అంటూ సమాధానం ఇచ్చారు.

ఇక షూటింగ్ ఏర్పాట్లు చేస్తుంటే.. నోయల్ నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేందటూ గోల పెట్టారు. పైగా నా డబ్బులే తీసుకొని సినిమా తీస్తున్నారంటూ కామెంట్ చేశాడు. ఇదే సమయంలో అరియానా కూడా నాకు అడ్వాన్సు కూడా ముట్టలేదు అంటూ అభిజిత్‌పై కామెంట్ చేస్తే.. ఇది నా మొదటి సినిమా కోఆపరేట్ చేయండి బతిమాలాడుకొన్నాడు. ఇంతలోనే టచ్ అప్ అంటూ యాంకర్ లాస్య ఆర్టిస్టులకు మేకప్ చేస్తూ హంగామా చేసింది. ఇలాంటి హంగామా మధ్య సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X