Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నీతో పోటీ పడటం నాకు కష్టం.. కానీ నేనే బిగ్‌బాస్ విన్నర్.. ఆకట్టుకొన్న అభిజిత్ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్లో చివరి వారం కూడా ఇంటి సభ్యుల మధ్య ఎమోషన్స్, గేమ్ స్ట్రాటెజీలు భారీగా కనిపించాయి. బిగ్‌బాస్ ఇంటిలో ఎవరు అనర్హులు అనే టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇవ్వగా ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అభిజిత్ వెల్లడించిన అభిప్రాయం అందర్నీ ఆకట్టుకొంటున్నది. అభిజిత్ ఏమన్నారంటే..
సీజన్లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యింది నేనే
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే కంటెస్టెంట్ అనుకొంటే సరిపోదు. ప్రేక్షకుల ఆదరణ, ఓట్లు పొందాలి. ఈ ఇంటిలో ఎక్కువ సార్లు నామినేట్ అయిన వ్యక్తిని నేనే. దాదాపు ప్రతీ వారం నామినేట్ అయి సేవ్ అవ్వడం అంటే మాటల్లో చెప్పలేం. కానీ నేను ఆడుతున్న తీరు కరెక్ట్ అనేది నాకు స్పష్టమైంది అంటూ అభిజిత్ అన్నారు.
విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు నాకే
గత 14 వారాల్లో అనేక నామినేషన్లను, గేమ్ తీరును చూస్తే.. బిగ్‌బాస్ తెలుగు 4లో విజేతగా నిలిచేందుకు నాకు అన్ని రకాల అర్హత ఉందని నేను భావిస్తున్నాను. అయితే టాప్ 5లో నిలిచిన మిగితా వారు అర్హులు కాదని నేను అనను. ఇక్కడ ప్రతీ ఒక్కరు విన్నర్. ఒక్కరు మాత్రమే ట్రోఫి గెలవాలి. కాబట్టి మీ కంటే బెటర్ అనే విషయాన్ని నేను చెప్పదలచుకొన్నాను అని అభిజిత్ పేర్కొన్నారు.
హారికతో పోటీ పడాలంటే కష్టమే
బిగ్‌బాస్ ఇంటిలో అర్హులు కాదనే విషయాన్ని చెప్పాలి కాబట్టి. మీ ముగ్గురిలో ఎవరిపైనా విజయం సాధించినా నాకు పెద్దగా ప్రభావం ఉండదు. అలాగే బ్యాడ్‌గా ఫీల్ కాను. ఈ పోటీలో చివరి వరకు నేను హారికతో పోటీ పడాలంటే ఎమోషనల్‌గా నాకు చాలా కష్టం. ఎందుకంటే ఆమె ఓడిపోవడం నేను చూడలేను అంటూ అభిజిత్ అన్నాడు.
నీవు నాతో పోటీ పడితే దారుణంగా
బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకొనే విషయంలో నీవు నా పక్కన నిలుచుంటే.. ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది. నా జీవితంలో చాలా వరస్ట్ కేసుగా అనిపిస్తున్నది. నిజాయితీగా చెప్పాలంటే హారిక కాకుండా ముగ్గురిలో ఎవరు ఉన్న నాకు అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఇలాంటి విషయాలన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నీవు అర్హురాలివి కావొద్దనే విషయాన్ని నేను చెప్పదలచుకొన్నాను. ఎందుకంటే నేను ఈ పోటీలో గెలవాలనుకొంటున్నాను అని బిగ్‌బాస్‌కు అభిజిత్ చెప్పడం జరిగింది.
Recommended Video
నన్ను అనర్హురాలిగా ప్రకటించావా?
అభిజిత్ మాట్లాడిన తర్వాత హారిక దేత్తడి కన్ఫ్యూజన్లో పడింది. నన్ను అనర్హురాలిగా భావిస్తున్నావా? ఎందుకంటే నీకు టఫ్ సిచ్యువేషన్ ఉంటుందని నన్ను అనర్హురాలిగా భావిస్తున్నావా అంటూ హారిక అడిగింది. అందుకు అవును అంటూ అభిజిత్ సమాధానం ఇచ్చారు.