మోనాల్ దెబ్బకు రికార్డులు బద్దలు: అభిజీత్ వల్లే ఆమెకిది సాధ్యం అయిందా!
పేరుకు ఉత్తరాదికి చెందిన అమ్మాయే అయినా... బిగ్ బాస్ షోలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్. సీజన్ ఆరంభం నుంచే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, నామినేషన్‌లో ఉన్నప్పటికీ ఊహించని విధంగా సేవ్ అవుతూ వస్తుండడంతో మరింత పాపులర్ అయింది. దీంతో మోనాల్ గజ్జర్ వ్యవహారంతో బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పేరిట రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అభిజీత్ వల్లే ఆమెకిది సాధ్యమైందన్న టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...

నర్మదా నదిగా పేరు.. అప్పుడే గొడవ
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదట్లోనే మోనాల్ గజ్జర్.. సహచర కంటెస్టెంట్ సూర్య కిరణ్‌తో గొడవకు దిగింది. అప్పుడు ఏడవడం ప్రారంభించిన ఆమె.. షో మొత్తం అదే కంటిన్యూ చేస్తోంది. దీంతో హోస్ట్ నాగార్జున ఆమెకు నర్మదా నది అని పేరు పెట్టాడు. అయినప్పటికీ ఎప్పుడూ ఏడుస్తూనే కనిపిస్తూ ప్రేక్షకుల్లో అసహనం కలిగిస్తోందీ గుజరాతీ ముద్దుగుమ్మ.

ట్రైయాంగిల్ లవ్ వల్ల హాట్ టాపిక్‌గా
నాలుగో సీజన్ ఆరంభంలో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో క్లోజ్‌గా ఉండడం మొదలు పెట్టింది. దీనిని బిగ్ బాస్ నిర్వహకులు ట్రైయాంగిల్ లవ్‌గా పేర్కొనడంతో పాటు ఎక్కువగా హైలైట్ చేశారు. దీంతో మోనాల్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో ఆమె పరువు కూడా పోయినంత పని అయింది.

మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ దత్త పుత్రిక
ఇప్పటి వరకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో 12 వారాల పాటు నామినేషన్స్ జరిగాయి. వాటిలో చాలా వరకు మోనాల్ నామినేట్ అయింది. అయినప్పటికీ ఆమె ఎలిమినేషన్ తప్పించుకుంది. దీనికి కారణం ప్రేక్షకుల ఓట్లు కాదని, బిగ్ బాస్ రేటింగ్ కోసమే ఆమెను కాపాడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఆమె బిగ్ బాస్ దత్తపుత్రిక అన్న కామెంట్లు కూడా వినిపించాయి.

ఈ వారం ఊహించని విధంగా వెళ్లింది
ప్రతి సోమవారం నామినేషన్స్ టాస్క్ జరుగుతుంది. అందులో ఒక కంటెస్టెంట్.. మరో ఇద్దరిని నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే, ఈ వారం కొత్త టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్కు మొదటి దశలో సేవ్ అయిన మోనాల్.. కెప్టెన్ హారిక తీసుకున్న నిర్ణయంతో నామినేట్ అయింది. ఆ తర్వాత ఇమ్యూనిటీ చాన్స్ వచ్చినా గెలవలేకపోయింది.

మోనాల్ దెబ్బకు రికార్డులు బద్దలు
నామినేషన్స్ తర్వాత ఎప్పటిలాగే ఈ వారం కూడా మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అవదు అన్న టాక్ బాగా వినిపించింది. కానీ, ఊహించని విధంగా ఈ వారం ఓటింగ్‌లో ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న అఖిల్ సార్థక్, ఆరియానా గ్లోరీ, అవినాష్‌లను వెనక్కి నెడుతూ మోనాల్ దూసుకుపోతోంది. అంతేకాదు, ఆమె ఈ వారం రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Recommended Video

అభిజీత్ వల్లే ఆమెకిది సాధ్యం అయిందా
బిగ్ బాస్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్‌గా అభిజీత్ నిలుస్తున్నాడు. ఈ వారం అతడు నామినేషన్స్‌లో లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ మోనాల్ గజ్జర్‌పై కనపడుతుందన్న టాక్ వినిపిస్తోంది. అభిజీత్ ఫ్యాన్స్‌తో పాటు కెప్టెన్ చేసిందన్న కారణంతో హారిక అభిమానులు ఆమెకు ఓట్లు వేస్తున్నారని తెలుస్తోంది. అందుకే దాదాపు నలభై శాతం ఓట్లు ఆమె ఒక్కదానికే పోలైనట్లు టాక్.


Click it and Unblock the Notifications











