మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం: అతడు లైవ్‌లోనే షాకివ్వడంతో ఒప్పుకోక తప్పలేదు

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని రీతిలో గుర్తింపును అందుకున్న వారిలో గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ ఒకరు. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. పెద్దగా పరిచయం కాలేకపోయిన ఈ ముద్దుగుమ్మ.. రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకుంది. హౌస్‌లో ట్రాకులు నడుపుతూ.. గొడవలు పడుతూ 14 వారాల పాటు నెగ్గుకొచ్చింది. ఇక, గత వారం ఎలిమినేట్ అయిన ఆమె.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ట్రైయాంగిల్ లవ్ అంటూ హైలైట్ చేశారు

ట్రైయాంగిల్ లవ్ అంటూ హైలైట్ చేశారు

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్ ఎక్కువగా అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ కనిపించింది. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం మొదలు పెట్టింది. ఇలా ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఉండడంతో దీన్ని ట్రైయాంగిల్ లవ్ అంటూ హైలైట్ చేశారు షో నిర్వహకులు. ఈ ట్రాకుల వల్ల మోనాల్ గజ్జర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

గేమ్ ఆడకున్నా... అన్ని వారాల పాటు

గేమ్ ఆడకున్నా... అన్ని వారాల పాటు

వాస్తవానికి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అమ్మాయిలతో పోలిస్తే మోనాల్ గజ్జర్ పెద్దగా గేమ్ ఆడిన దాఖలాలు లేవు. దీంతో ఆమె ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మాత్రం చాలా వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. దీనిపై ఎన్నో విమర్శలు చెలరేగాయి. టాస్కులు ఆడే వారిని కాదని, స్కిన్ షో చేసే వాళ్లను ఉంచుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

చివరి మెట్టుపై బోల్తా... షో నుంచి ఔట్

చివరి మెట్టుపై బోల్తా... షో నుంచి ఔట్

లవ్ ట్రాకులు.. గొడవలు.. మసాల సీన్లు.. గ్లామర్ షో ఇలా ఎన్నో రకాల షేడ్స్ చూపిస్తూ బిగ్ బాస్ హౌస్‌లో నెగ్గుకొచ్చింది మోనాల్ గజ్జర్. కానీ, ఫినాలేకు ఒక వారం ముందు అంటే 14వ వీక్‌లో ఆమె బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన నిర్వహకులు.. టాప్ -5లోనూ ఉంచుతారని అనుకున్నా.. అనూహ్యంగా బయటకు వచ్చిందామె.

బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయింది

బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయింది

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చే సమయంలో అఖిల్ సార్థక్.. ‘నీతో ఇంపార్టెంట్ మేటర్ మాట్లాడాలి. నేనొచ్చే వరకూ హైదరాబాద్‌లోనే ఉండు' అంటూ మోనాల్ గజ్జర్‌కు చెప్పాడు. అందుకు అనుగుణంగానే ఆమె నగరంలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో రచ్చ రచ్చ చేస్తోంది. కెరీర్ పరంగానూ బిజీగా మారబోతుందని ఇటీవల రివీల్ చేసింది.

అక్కడ మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం

అక్కడ మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం

వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోన్న మోనాల్ గజ్జర్.. సమయం దొరికినప్పుడల్లా ఫ్యాన్స్‌తో సంభాషించేందుకు సోషల్ మీడియా లైవ్‌లోకి వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన విషయాలను గురించి వివరించింది. సరిగ్గా ఆ సమయంలోనే మోనాల్ గజ్జర్‌కు కోలుకోలేని షాక్ తగిలింది.

 లైవ్‌లో షాకివ్వడంతో ఒప్పుకోక తప్పలేదు

లైవ్‌లో షాకివ్వడంతో ఒప్పుకోక తప్పలేదు

లైవ్‌లో అఖిల్ గెలుస్తాడని మోనాల్ చెబుతుండగా ఓ నెటిజన్.. ‘అఖిల్ అస్సలు విన్నర్ కాలేడు గుర్తు పెట్టుకో' అని ఝలక్ ఇచ్చాడు. దీంతో ‘ఎందుకలా మాట్లాడుతారు. ట్రోలింగ్ చేయడం తప్పు. ఈ సారి ది బెస్ట్ పర్సన్ గెలుస్తున్నారు. ఎవరు గెలుస్తారు అని మీరు డిసైడ్ చేయకండి. అఖిల్, అభి, సోహెల్, హారికలలో ఎవరు గెలిచినా హ్యాపీనే' అంటూ కవర్ చేసుకుంది మోనాల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X