ఫినాలేకు ముందు హారికకు భారీ ఎదురుదెబ్బ: వాళ్లు చేసిన పనికి ఏకంగా డేంజర్ జోన్‌లోకి!

దేత్తడి హారిక... కొద్ది రోజులుగా బాగా వినిపిస్తోన్న పేరిది. సోషల్ మీడియాలో విభిన్నమైన వీడియోలను వదులుతూ ఎంతగానో గుర్తింపు తెచ్చుకుందామె. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది. షోలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోందీ భామ. అదే సమయంలో అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా, ఫినాలేకు ముందు హారికకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాళ్లంతా హ్యాండివ్వడంతో ఏకంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఆ వివరాలు మీకోసం!

హారిక ఒక ఫైటర్.. ఎనిమిది సార్లు పోటీ

హారిక ఒక ఫైటర్.. ఎనిమిది సార్లు పోటీ

అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రతి విషయంలోనూ భాగం అవుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక, అన్ని టాస్కుల్లోనూ వందకు వంద శాతం శ్రమిస్తూ సత్తా చాటింది. ఈమె ఒక్కదే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి అందరి కంటే ఫైటర్ అని నిరూపించుకుంది.

అభిజీత్‌తో లవ్ ట్రాకుతో హాట్ టాపిక్‌గా

అభిజీత్‌తో లవ్ ట్రాకుతో హాట్ టాపిక్‌గా

బిగ్ బాస్ హౌస్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న దేత్తడి హారిక... తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు తరచూ హగ్గులు ఇవ్వడం.. అప్పుడప్పుడు ముద్దులు పెట్టడం వంటి వాటితో హాట్ టాపిక్ అయింది. దీంతో వీళ్లిద్దరని ‘అభిక' అని సంభోదిస్తున్నారు అభిమానులు.

 వాళ్ల మద్దతుతోనే ఇప్పటి వరకూ ఇలా

వాళ్ల మద్దతుతోనే ఇప్పటి వరకూ ఇలా

బిగ్ బాస్‌లో ఎంత ఆడినా లక్, సపోర్ట్ కూడా ఉండాలి. హారిక అదృష్టం ఏమోగానీ, సపోర్ట్ మాత్రం బాగానే ఉంది. బయట తనను అభిమానించే వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లకు తోడు నోయల్ సీన్ కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నాడు. అలాగే, అభిజీత్ ఫ్యాన్స్ కూడా ఆమెకు ఓట్లు వేస్తున్నారు. ఈ కారణాల వల్లే హారిక ఫినాలే స్టేజ్ వరకూ గేమ్‌లో కొనసాగుతోందని చెప్పొచ్చు.

నాగార్జున వార్నింగ్‌తో మారిపోయింది

నాగార్జున వార్నింగ్‌తో మారిపోయింది

రెండు వారాల క్రితం బిగ్ బాస్ దెయ్యం జలజ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హారిక అట్టర్ ఫ్లాప్ అయిందని అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వరస్ట్ కెప్టెన్ అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ‘నీ ఆట నువ్వు అడు.. లేకపోతే కష్టాలు తప్పవు' అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హారిక.. అభిజీత్‌కు దూరం అవడంతో పాటు తన ఆటను కూడా మార్చుకుంది.

ఫినాలేకు ముందు హారికకు ఎదురుదెబ్బ

ఫినాలేకు ముందు హారికకు ఎదురుదెబ్బ

ప్రస్తుత వారంలో అఖిల్ సార్థక్ మినహా ఐదుగురు కంటెస్టెంట్లు నేరుగా నామినేట్ అయ్యారు. వీరిలో అభిజీత్‌, దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్ టాస్కుల్లో మంచి ప్రదర్శన ఇచ్చి ఓట్లు ఆడగాలని బిగ్ బాస్ సూచించాడు. దీంతో అందరూ చక్కగా ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరి వల్ల హారికకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
అభిజీత్ వల్ల ఏకంగా డేంజర్ జోన్‌లోకి!

అభిజీత్ వల్ల ఏకంగా డేంజర్ జోన్‌లోకి!


నిన్న మొన్నటి వరకూ హారికకు ఓట్లు వేశారు అభిజీత్ ఫ్యాన్స్. ఫినాలేకు ఒక వారమే ఉండడంతో తమ అభిమాన కంటెస్టెంట్‌కే మద్దతు తెలిపాలని వాళ్లంతా ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే VoteForAbijeetOnly అనే ట్యాగ్‌ను మెన్షన్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. అంటే పరోక్షంగా హారికకు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆమె ఓటింగ్‌లో వెనుకబడినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X