Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ నిజస్వరూపం బయటపెట్టిన బిగ్ బాస్ ..ఆ వీడియోలో అసలు మేటర్ లీక్ చేశాడు
మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడమే. అంతేకాదు, హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకుల కారణంగా బాగా హైలైట్ అయింది. అయితే, ఎలిమినేట్ అయినా అభిజీత్‌కు మోనాల్‌కు మధ్య గొడవకు కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు. ఈ నేపథ్యంలో ఓ వీడియో చూపించి మరీ ప్రేక్షకుల ముందు ఆమె నిజస్వరూపం బయట పెట్టాడు బిగ్ బాస్. ఆ వివరాలు మీకోసం!

అభిజీత్‌తో సన్నిహితంగా ఉంటూ
మోనాల్ గజ్జర్ సీజన్ ఆరంభంలో అభిజీత్‌తోనే ఎక్కువగా క్లోజ్ అయింది. తరచూ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ కనిపించే వారు. అంతేకాదు, రొమాంటిక్ చూపులు, హగ్గులతో రచ్చ రచ్చ చేసేవారు. దీంతో షో నిర్వహకులు కూడా వీళ్లనే బాగా ఫోకస్ చేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం మొదలైంది. తద్వారా మోనాల్ హాట్ టాపిక్ అయింది.

అఖిల్ ఎంట్రీతో అతడి వైపు వెళ్లింది
అభిజీత్‌తో మోనాల్ గజ్జర్ మరింత క్లోజ్ అవుతోన్న సమయంలో అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆమెతో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, ఆమెను ఎంతో కేరింగ్‌గా చూసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో అభిజీత్ నుంచి అతడి వైపు వెళ్లిపోయిందామె. అప్పటి నుంచి వీళ్లిద్దరూ మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించారు.

దూరం పెట్టిన అభిజీత్.. గొడవలు
అఖిల్ సార్థక్‌తో మోనాల్ గజ్జర్ రోజురోజుకూ దగ్గరవుతూ వచ్చింది. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో అభిజీత్ ఆమెను పూర్తిగా దూరం పెట్టేశాడు. అంతేకాదు, ఆమె మాట్లాడడం, చూసి నవ్వడం వంటివి కూడా చేయలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అఖిల్ ఆమె తరపున నిలుస్తూ పలుమార్లు అభితో గొడవలు కూడా పెట్టుకున్నాడు.

టాస్క్ చేయనని.. నామినేట్ చేసి
నాలుగో సీజన్‌లో దెయ్యం ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జలజ.. మోనాల్‌తో డేట్ చేయమని చెప్పగా.. ఈ టాస్క్ చేయడానికి అభిజీత్ నిరాకరించాడు. అప్పుడు వరస్ట్ పెర్ఫార్మర్ అని బిగ్ బాస్ అతడికి బిరుదిచ్చాడు. ఆ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వల్ల చీవాట్లు కూడా తిన్నాడు. దీంతో తర్వాతి వారం మోనాల్‌ను నామినేట్ చేశాడు అభిజీత్.

జెంటిల్‌మెన్ అనిపించుకున్నాడు
దేత్తడి హారికతో జరిగిన ఓ సంభాషణలో మోనాల్‌తో తాను ఎందుకు దూరంగా ఉంటున్నాడో వివరించాడు అభిజీత్. ‘ఆమె నన్ను ఇష్టపడుతున్నా అని చెప్పింది. ఆ తర్వాత నన్ను దూరం పెట్టింది. దీన్ని ఎలా తీసుకోవాలి.? ఈ విషయం నేనెప్పుడో బయట పెట్టేవాడిని. కానీ, అటు ఉన్నది అమ్మాయి కావడం వల్లే సైలెంట్‌గా ఉన్నా' అని తాను పక్కా జెంటిల్‌మెన్ అని నిరూపించుకున్నాడు.

నిజస్వరూపం బయటపెట్టిన బిగ్ బాస్
తాజా ఎపిసోడ్‌లో అభిజీత్ జర్నీ వీడియో ప్రసారం చేశాడు బిగ్ బాస్. ఇందులో ఎక్కువగా మోనాల్‌నే హైలైట్ చేశాడు. అంతేకాదు, ఆమె అభికీ ‘ఐ లైక్ యూ' అని చెప్పడం.. అతడితో చనువుగా ఉండడం చూపించాడు. ఆ తర్వాత ఆమె దూరమవడంతో పాటు అఖిల్‌తో క్లోజ్ అయింది కూడా బయట పెట్టాడు. దీంతో అభిజీత్ ఆమెను ఎందుకు దూరం పెట్టాడో అందరికీ అర్థమయ్యేలా చేశాడు.