బిగ్ బాస్ తర్వాత తొలి సినిమా: కథ విన్నానంటూ అభిజీత్ పోస్ట్.. చివర్లో అలా ట్విస్ట్ ఇవ్వడంతో షాక్

హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు లవర్ బాయ్ అభిజీత్. అయితే, బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో అతడు ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. క్లిష్ట సమయాల్లోనూ సహనం కోల్పోకుండా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. తద్వారా నాలుగో సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు. షో తర్వాత అతడి సినిమాల గురించి పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ తర్వాత తొలిసారి ఓ కథ విన్నానంటూ అభిజీత్ పోస్ట్ చేశాడు. అయితే, చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చి షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే...

డీసెంట్‌గా మొదలై.. అలా ముగిసిన కెరీర్

డీసెంట్‌గా మొదలై.. అలా ముగిసిన కెరీర్

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు లోకల్ బాయ్ అభిజీత్. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి చిత్రాల్లో నటించినా.. హిట్‌ను మాత్రం అందించలేదు. అయితే, అతడు చేసిన 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. ఒక్కసారిగా ఫేమస్

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. ఒక్కసారిగా ఫేమస్

పలు సినిమాల్లో నటించినా అభిజీత్ పేరు చాలా మందికి తెలియదు. అలాంటి సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడతను. ఏమాత్రం అంచనాలు లేకుండా లోపలికి వెళ్లిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. వ్యక్తిగతంగా, ఆట పరంగా మంచి పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు.

లవ్ ట్రాకుతో పాపులర్.. మైండ్ గేమ్‌ ఆడి

లవ్ ట్రాకుతో పాపులర్.. మైండ్ గేమ్‌ ఆడి

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుంచే హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు అభిజీత్. అలా కొద్ది రోజుల పాటు ఆమెతో క్లోజ్‌గా ఉన్న అతడు.. ఆ తర్వాత దేత్తడి హారికకు దగ్గరయ్యాడు. అప్పటి నుంచి దాదాపు షో ముగిసే వరకూ ఆమెతో ప్రేమాయణం సాగించినట్లుగా వ్యవహరించాడు. దీంతో వీళ్లిద్దరి పేర్లను కలిపి 'అభిక'గా ట్రెండ్ సెట్ చేశారు ఇరువురి ఫ్యాన్స్.

ప్రేక్షకులను గెలిచాడు.. విజేతగా నిలిచాడు

ప్రేక్షకులను గెలిచాడు.. విజేతగా నిలిచాడు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. కొన్ని టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను గెలిచాడు. దీంతో ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఓట్లు సాధించి బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడీ యంగ్ సెన్సేషన్.

వాళ్లంతా ఫుల్ బిజీ... అభి మొదలెట్టలేదు

వాళ్లంతా ఫుల్ బిజీ... అభి మొదలెట్టలేదు

ఈ రియాలిటీ షో ముగిసిన తర్వాత అందులో కంటెస్టెంట్లుగా పాల్గొన్న సయ్యద్ సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ, అవినాష్, మోనాల్ గజ్జర్ సహా ఎంతో మంది వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ మాత్రం ఏమీ మొదలెట్టలేదన్న టాక్ వినిపించింది. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతడికి రిక్వెస్టులు కూడా పెట్టారు.

కథ విన్నానంటూ పోస్ట్.. చివర్లో అలా ట్విస్ట్

కథ విన్నానంటూ పోస్ట్.. చివర్లో అలా ట్విస్ట్

తాజాగా అభిజీత్.. ఓ మూవీ స్క్రిప్ట్ విన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేయడంతో పాటు ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. అందులో 'శనివారం రాత్రి నా ఆఫీసులో మూడు గంటల పాటు ఓ స్టోరీ విన్నాను. అయితే, ఇది ఏమాత్రం సంతృప్తికరంగా అనిపించలేదు' అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. అయితే, ఆ కథ చెప్పింది ఎవరో మాత్రం వెల్లడించలేదీ విన్నర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X