Just In
- 1 hr ago
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
- 2 hrs ago
ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
- 2 hrs ago
సినిమా కోసం నిజంగానే పంట పండించారట కానీ.. ‘శ్రీకారం’ సీక్రెట్స్ ఇవే!
- 3 hrs ago
ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- News
అమానుషం.. సర్జరీ చేసి కుట్లు వేయకుండా... బాధతో విలవిల్లాడుతూ చిన్నారి మృతి...
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Finance
భారీగా క్షీణించిన ఎలాన్ మస్క్ సంపద, ఎందుకంటే?
- Lifestyle
Makeup Tips:మీకు అందమైన లుక్ కావాలంటే... మీ స్కిన్ టోన్ కు ఏ లిప్ స్టిక్ సెట్ అవుతుందో చూసెయ్యండి...
- Automobiles
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత క్రికెటర్‌తో కలిసి రచ్చ చేసిన అభిజీత్: గుడ్ న్యూస్ రాబోతుందంటూ బిగ్ బాస్ విన్నర్ పోస్ట్
సినిమా హీరోగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ యాక్టర్ అభిజీత్. లోపలికి వెళ్లినప్పటి నుంచే తనదైన శైలి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ కారణంగానే ఎన్నో సార్లు నామినేషన్స్‌లో ఉన్నా ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. ఫలితంగా ఫినాలేకు చేరువవడంతో పాటు సీజన్ విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన అభిజీత్.. తాజాగా భారత క్రికెటర్‌తో కలిసి రచ్చ చేశాడు. అంతేకాదు, త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందంటూ ఓ పోస్టు కూడా పెట్టాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. సినిమాలకు బ్రేక్
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అతడికి కూడా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ‘రామ్ లీలా', ‘మిర్చి లాంటి కుర్రాడు' వంటి సినిమాల్లో చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సినిమాలకు బ్రేకిచ్చాడు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లు చేశాడు.

లవర్ బాయ్ పేరు.. అదే కంటిన్యూ చేసి
పలు సినిమాల్లో నటించడం ద్వారా పాపులర్ అయిన అభిజీత్.. ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ ఉండడం మొదలెట్టి లవర్ బాయ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమె అతడికి దూరమైపోయింది. అప్పటి నుంచే దేత్తడి హారికకు దగ్గరయ్యాడు అభిజీత్. దీంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు.

టాస్కుల్లో కాదు.. ప్రేక్షకులను గెలిచాడు
టాస్కుల్లో గెలవాలంటే కండబలం మాత్రమే ఉంటే సరిపోదని, బుద్దిబలం కూడా ఉండాలని నిరూపించాడు అభిజీత్. అందుకు అనుగుణంగానే కొన్ని టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో హౌస్‌లో బలమైన కంటెస్టెంట్‌గా మారిపోయాడు. ఈ కారణంగానే ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అవడంతో పాటు బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు.

అభిజీత్ ఫుల్ బిజీ.... సినిమాల ఆఫర్లు
బిగ్ బాస్ గెలిచి వచ్చిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయ్యాడు. చాలా రోజుల పాటు తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పడంతో పాటు వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపాడు. అదే సమయంలో అతడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వెంకీ కుడుములతో మూవీ, F3లో ఛాన్స్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అభిజీత్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రోహిత్
బిగ్ బాస్ విజయంతో ఫుల్ జోష్ మీదున్న అభిజీత్‌కు ఇటీవల భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన జెర్సీని ఆస్ట్రేలియా నుంచి గిఫ్టుగా పంపించాడు. దీనిపై అతడి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. ఇది రావడానికి కారణం.. ఆంధ్రాకు చెందిన క్రికెటర్ హనుమ విహారినే అన్న విషయం తెలిసిందే. అభిజీత్‌కు రోహిత్ అంటే ఇష్టమని తెలుసుకున్న అతడు.. ఈ స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశాడు.

భారత క్రికెటర్‌తో కలిసి అభిజీత్ హల్‌చల్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అసాధారణ ఆటతీరుతో ఇండియాను ఓటమి నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషించాడు విహారి. అయితే, ఆ తర్వాత గాయ పడడంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌తో కలిసి అతడు హల్‌చల్ చేశాడు.

గుడ్ న్యూస్ రాబోతుందంటూ అభి పోస్ట్
హనుమ విహారినీ అభిజీత్ కలిశాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన బిగ్ బాస్ విన్నర్.. ‘ఫైటర్.. అంతా మంచే జరుగుతుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరోవైపు, ఇదే ఫొటోను విహారి కూడా తన సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.