twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారత క్రికెటర్‌తో కలిసి రచ్చ చేసిన అభిజీత్: గుడ్ న్యూస్ రాబోతుందంటూ బిగ్ బాస్ విన్నర్ పోస్ట్

    |

    సినిమా హీరోగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ యాక్టర్ అభిజీత్. లోపలికి వెళ్లినప్పటి నుంచే తనదైన శైలి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ కారణంగానే ఎన్నో సార్లు నామినేషన్స్‌లో ఉన్నా ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. ఫలితంగా ఫినాలేకు చేరువవడంతో పాటు సీజన్ విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన అభిజీత్.. తాజాగా భారత క్రికెటర్‌తో కలిసి రచ్చ చేశాడు. అంతేకాదు, త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందంటూ ఓ పోస్టు కూడా పెట్టాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

    Recommended Video

    Telugu Bigg Boss Winner Abijeet Gets A Surprise Gift From Cricketer Rohit Sharma || Oneindia Telugu
    అలా మొదలైన కెరీర్.. సినిమాలకు బ్రేక్

    అలా మొదలైన కెరీర్.. సినిమాలకు బ్రేక్

    శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అతడికి కూడా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి సినిమాల్లో చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సినిమాలకు బ్రేకిచ్చాడు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లు చేశాడు.

    లవర్ బాయ్ పేరు.. అదే కంటిన్యూ చేసి

    లవర్ బాయ్ పేరు.. అదే కంటిన్యూ చేసి

    పలు సినిమాల్లో నటించడం ద్వారా పాపులర్ అయిన అభిజీత్.. ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ ఉండడం మొదలెట్టి లవర్ బాయ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమె అతడికి దూరమైపోయింది. అప్పటి నుంచే దేత్తడి హారికకు దగ్గరయ్యాడు అభిజీత్. దీంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు.

    టాస్కుల్లో కాదు.. ప్రేక్షకులను గెలిచాడు

    టాస్కుల్లో కాదు.. ప్రేక్షకులను గెలిచాడు

    టాస్కుల్లో గెలవాలంటే కండబలం మాత్రమే ఉంటే సరిపోదని, బుద్దిబలం కూడా ఉండాలని నిరూపించాడు అభిజీత్. అందుకు అనుగుణంగానే కొన్ని టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో హౌస్‌లో బలమైన కంటెస్టెంట్‌గా మారిపోయాడు. ఈ కారణంగానే ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అవడంతో పాటు బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు.

    అభిజీత్ ఫుల్ బిజీ.... సినిమాల ఆఫర్లు

    అభిజీత్ ఫుల్ బిజీ.... సినిమాల ఆఫర్లు

    బిగ్ బాస్ గెలిచి వచ్చిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయ్యాడు. చాలా రోజుల పాటు తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పడంతో పాటు వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపాడు. అదే సమయంలో అతడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వెంకీ కుడుములతో మూవీ, F3లో ఛాన్స్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    అభిజీత్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రోహిత్

    అభిజీత్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రోహిత్

    బిగ్ బాస్ విజయంతో ఫుల్ జోష్ మీదున్న అభిజీత్‌కు ఇటీవల భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన జెర్సీని ఆస్ట్రేలియా నుంచి గిఫ్టుగా పంపించాడు. దీనిపై అతడి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. ఇది రావడానికి కారణం.. ఆంధ్రాకు చెందిన క్రికెటర్ హనుమ విహారినే అన్న విషయం తెలిసిందే. అభిజీత్‌కు రోహిత్ అంటే ఇష్టమని తెలుసుకున్న అతడు.. ఈ స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశాడు.

    భారత క్రికెటర్‌తో కలిసి అభిజీత్ హల్‌చల్

    భారత క్రికెటర్‌తో కలిసి అభిజీత్ హల్‌చల్

    ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అసాధారణ ఆటతీరుతో ఇండియాను ఓటమి నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషించాడు విహారి. అయితే, ఆ తర్వాత గాయ పడడంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌తో కలిసి అతడు హల్‌చల్ చేశాడు.

    గుడ్ న్యూస్ రాబోతుందంటూ అభి పోస్ట్

    గుడ్ న్యూస్ రాబోతుందంటూ అభి పోస్ట్

    హనుమ విహారినీ అభిజీత్ కలిశాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన బిగ్ బాస్ విన్నర్.. 'ఫైటర్.. అంతా మంచే జరుగుతుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరోవైపు, ఇదే ఫొటోను విహారి కూడా తన సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Abijeet Duddala is an Indian film actor who works in Telugu films. He made his debut as the main lead in the film Life Is Beautiful, directed by Sekhar Kammula in 2012. He made his web series debut with Pelli Gola (2017–19). In 2020, Abijeet entered as a contestant in the Telugu reality TV show Bigg Boss 4.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X