twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డుల తిరగరాస్తున్న అభిజిత్, మోనాల్ గజ్జర్.. హారిక కూడా ఆ విషయంలో తగ్గడం లేదుగా!

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో నామినేషన్ల ప్రక్రియ పేరుతో ముగ్గురు కంటెస్టెంట్లు అత్యధికంగా టార్గెట్ అవ్వడం ఆసక్తిగా మారింది. దాదాపు 11 సార్లు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అభిజిత్, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక పలు‌మార్లు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే ఈ ముగ్గురు ఎన్నిసార్లు నామినేట్ అయ్యారంటే..

    అభిజిత్ అత్యధికంగా నామినేట్

    అభిజిత్ అత్యధికంగా నామినేట్

    ప్రస్తుతం కొనసాగున్న 11వ వారం బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో అభిజిత్ 9 సార్లు నామినేట్ అయ్యారు. అభిజిత్ నామినేట్ అయిన తీరు చూస్తే.. బిగ్‌బాస్ షో ప్రారంభమైన తొలి వారంతోపాటు 2 వ వారం, 4 వారం, 5 వ వారం, 6 వ వారం, 7 వ వారం, 9 వ వారం,10 వ వారం,11 వ వారం నామినేట్ అయ్యాడు. మూడో వారం, ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకొన్నారు.

    మోనాల్ గజ్జర్ 9 సార్లు నామినేట్

    మోనాల్ గజ్జర్ 9 సార్లు నామినేట్

    మోనాల్ గజ్జర్ విషయానికి వస్తే అభిజిత్‌తోపాటు నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యారు. మొదటి వారం తప్పిస్తే.. 2 వ వారం, 3 వారం, 5 వ వారం, 6 వ వారం, 7 వ వారం, 8 వ వారం, 9 వ వారం,10 వ వారం,11 వ వారం నామినేట్ అయ్యారు. లేడి కంటెస్టంట్లలో ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయిన ఘనత మోనాల్‌కు దక్కింది.

    హారిక 7 సార్లు నామినేట్

    హారిక 7 సార్లు నామినేట్

    ఇక అభిజిత్, హారిక తర్వాత ఎక్కువ సార్లు నామినేట్ అయిన వారిలో హరిక దేత్తడి ఉన్నారు. హారిక మొత్తం 7 సార్లు నామినేట్ అయ్యారు. 2 వ వారం, 3 వారం, 4 వ వారం, 6 వ వారం, 9 వ వారం, 10వ వారం, 11వ వారం నామినేట్ అయ్యారు. ప్రతీ సారి హారిక తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసును దోచుకొని సేవ్ అవ్వడం గమనార్హం.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
    సోషల్ మీడియాలో బలంగా

    సోషల్ మీడియాలో బలంగా

    బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అందరూ భావిస్తున్న అభిజిత్‌‌ను ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో ఎలిమినేషన్ అంచు వరకు వచ్చారు. కానీ సోషల్ మీడియాలో బలంగా ఉండటంతో ప్రతీసారి బయటపడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే మోనాల్‌కు గుజరాత్ నుంచి ఓట్ల పడుతున్నాయనేది సమాచారం. హారికకు యూట్యూబర్ కావడం, ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె కఠిన పరీక్ష నుంచి గట్టెక్కుతున్నారు.

    English summary
    Bigg Boss Telugu 10th week show updates: Mehaboob Dilse has eliminated from Bigg Boss Telugu House in 10th week. Apart from that, Nominations for Elimination of 11 week has finished in the bigg Boss House. Abijeet, Lasya, Ariana Glory, Syed Sohel Ryan, Harika, Monal Gajjar in the list. Apart from this.. Abijeet, Monal Gajjar, Harika Dettadi are highest nominated contestants in Bigg Boss Telugu 4
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X