హారికకు భారీ షాకిచ్చిన అభిజీత్ మదర్: వాళ్లు హౌస్‌లో ఉన్నప్పుడు అదే చేశానంటూ చెప్పడంతో!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోయిన షో బిగ్ బాస్. నిన్నటి దానితో కలిసి మొత్తం నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు హైలైట్ అయ్యారు. అయితే, ఇందులో పాల్గొనకుండానే ఫేమస్ అయిన వారిలో ముందుంటారు ప్రస్తుత సీజన్ విన్నర్ అభిజీత్ మదర్ లక్ష్మీ ప్రసన్న. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆమె చేసిన కామెంట్ల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన కామెంట్లతో హారికకు షాకిచ్చారు. వివరాల్లోకి వెళ్తే...

బిగ్ బాస్ హౌస్‌లోకి లక్ష్మీ.. ఆకట్టుకున్నారు
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అభిజీత్ తరపున వాళ్ల అమ్మగారు లక్ష్మీ ప్రసన్న లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ సమయంలో ఆమె తన కొడుకుతో పాటు అందరు కంటెస్టెంట్లపై ప్రేమను చూపించారు. ఉన్న కాసేపు సరదాగా గడిపిన ఆమె.. హౌస్‌మేట్లతో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు.

కొట్టుకోండిరా.. అప్పుడే మజా వస్తుందంటూ
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలో షోలో జరుగుతోన్న గొడవలపై స్పందించారు అభిజీత్ అమ్మగారు లక్ష్మీ ప్రసన్న. ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. ‘అమ్మా.. షో కోసం మేము కొట్టుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి' అని అన్నాడు. దీనికి ఆమె.. ‘నో ప్రాబ్లమ్.. కొట్టుకోండిరా.. అప్పుడే మజా వస్తుంది' అంటూ ఆమె కామెంట్ చేసి నవ్వులు పూయించారు.

అభిజీత్ విజయంతో ఆమె బిజీగా అయ్యారు
ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ నాలుగో సీజన్ గత ఆదివారంతో ముగిసింది. అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిజీత్‌ను విజేతగా ప్రకటించాడు హోస్ట్ నాగార్జున. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి అతడికి ట్రోఫీ అందించాడు. విన్నర్ అయిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అభి. అదే సమయంలో అతడి తల్లి లక్ష్మీ కూడా చిట్ చాట్‌ల్లో పాల్గొంటున్నారు.

తన ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంటూ క్లారిటీ
తాజాగా అభిజీత్ అమ్మగారు లక్ష్మీ ప్రసన్న ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి.. బిగ్ బాస్ షో గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్లు అందరిలోనూ తన ఫేవరెట్ అభిజీత్ మాత్రమేనని చెప్పారామె. తన కొడుకు నిజాయితీపరుడని పేర్కొన్న ఆమె.. కంప్లీట్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడని కామెంట్ చేశారు.

హారికకు భారీ షాకిచ్చిన అభిజీతం తల్లి లక్ష్మీ
ఇదే ఇంటర్వ్యూలో తన కొడుకు గెలుపు కోసం ఎన్నో మొక్కులు మొక్కానని అభిజీత్ అమ్మగారు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అంతేకాదు, అతడు నామినేషన్‌లో ఉన్న సమయంలో ప్రతిరోజూ హాట్‌స్టార్ యాప్‌తో పాటు మిస్‌డ్ కాల్స్ ద్వారా ఓట్లు వేసేదాన్ని అని వెల్లడించారు. అదే సమయంలో ఓ ఊహించని కామెంట్ చేసిన ఆమె.. దేత్తడి హారికకు భారీ షాక్ ఇచ్చారు.

హౌస్‌లో ఉన్నప్పుడు అదే చేశానంటూ చెప్పి
అభిజీత్ నామినేషన్‌లో లేని సమయంలో ఎవరికి ఓటు వేశారని యాంకర్ అడిగిన ప్రశ్నకు అభిజీత్ అమ్మగారు లక్ష్మీ ప్రసన్న షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ‘హౌస్‌లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అభిజీత్ మాత్రమే. వాడు నామినేషన్‌లో లేని సమయంలో ఎవరికీ ఓట్ చేయలేదు. షో జరిగినంత కాలం ఇలాగే చేశాను' అని చెప్పారు. అంటే.. అభి క్లోజ్ ఫ్రెండ్స్ హారిక, లాస్యను సైతం ఆమె పక్కనపెట్టారు.


Click it and Unblock the Notifications











