తల్లి చేసిన పనికి అభిజీత్ పరువు గోవిందా.. సిగ్గుతో తల దించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్

తెలుగు బుల్లితెర చరిత్రలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన షో బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో రూపొందిన దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో వివాదాల కారణంగా విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా, ఈ షో మాత్రం వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న నాలుగో సీజన్ సైతం ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి కుటుంబ సభ్యులు రావడం కంటెస్టెంట్లకు సంతోషాన్నిచ్చింది. అంత వరకూ బాగానే ఉన్నా అభిజీత్ తల్లి చేసిన పని వల్ల అతడి పరువు పోయింది. ఆ వివరాలు మీకోసం.!

వాళ్ల ఎంట్రీతో కంటెస్టెంట్లలో పెరిగిన జోష్

వాళ్ల ఎంట్రీతో కంటెస్టెంట్లలో పెరిగిన జోష్

బిగ్ బాస్ షో సరికొత్త అంశాలతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ వారం నామినేషన్ ప్రక్రియ సమయంలో జరిగిన గొడవలతో మొదటి రెండు రోజులు హౌస్‌లో వాతావరణం తేడాగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల రాకతో మొత్తం మారిపోయింది. అంతేకాదు, కంటెస్టెంట్లలో ఒక్కసారిగా జోష్ పెరిగిపోయింది.

మొదటి రోజు జాలీ... రెండో రోజు బాధగా

మొదటి రోజు జాలీ... రెండో రోజు బాధగా

మొదటి రోజు అఖిల్ సార్థక్, దేత్తడి హారిక, అభిజీత్, అవినాష్‌ల తల్లులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ మొత్తం ఎంతో జాలీగా నడిచింది. ఇక, రెండో రోజు ఆరియానా బాయ్‌ ఫ్రెండ్‌తో పాటు సోహెల్ తండ్రి, మోనాల్ గజ్జర్ సోదరి ఇంట్లోకి ప్రవేశించారు. వీళ్ల రాకతో హౌస్‌లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ఎమోషనల్ అయిపోయారు.

ఒకే ఒక్క ఎపిసోడ్‌తో అందరూ కలిశారు

ఒకే ఒక్క ఎపిసోడ్‌తో అందరూ కలిశారు

బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు రావడంతో పాటు షోలో జరుగుతోన్న వ్యవహారాలపైనా స్పందించారు. మరీ ముఖ్యంగా అఖిల్, అభిజీత్, హారిక తల్లులు అందరూ కలిసి ఉన్నప్పుడు గొడవలు సామాన్యమేనని, దానికి తామేమీ చింతించడం లేదని స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న హౌస్‌మేట్స్ ఒక్కటైపోయారు.

రహస్యాలు కూడా బయటకొస్తున్నాయి

రహస్యాలు కూడా బయటకొస్తున్నాయి

కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చిన సమయంలో కంటెస్టెంట్లకు సంబంధించిన ఎన్నో రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఇంట్లో తమ పిల్లలను ఏమని పిలుస్తామో, ఎలా పెంచామో వంటి విషయాలను మిగిలిన వారితో పంచుకుంటున్నారు. అదే సమయంలో ఆరియానా తన గురించి, తన బాయ్‌ ఫ్రెండ్ గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించింది.

తల్లి చేసిన పనికి అభీ పరువు గోవిందా

తల్లి చేసిన పనికి అభీ పరువు గోవిందా


బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వచ్చిన అభిజీత్ తల్లి... కంటెస్టెంట్లు అందరికీ సంతోషాన్ని పంచారు. షోలో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడుతూ.. ‘కొట్టేసుకోండి.. అప్పుడే మజా ఉంటుంది' అని చెప్పారు. అదే సమయంలో కంటెస్టెంట్లు అందరికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంలోనే తన కొడుకు అభిజీత్ గురించి ఓ రహస్యాన్ని లీక్ చేశారామె.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
సిగ్గుతో తల దించుకున్న లవర్ బాయ్

సిగ్గుతో తల దించుకున్న లవర్ బాయ్

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన అభిజీత్ తల్లి.. ‘అందరి ముందు నీకో సీక్రెట్ చెబుతున్నా. అదేమిటంటే నువ్వు తాతవు అయ్యావురా' అని ఊహించిన న్యూస్ ఒకటి చెప్పారు. దీంతో చిన్న వయసులోనే తాత అయిపోయానా అంటూ అభీ సిగ్గుతో తల దించుకున్నాడు. దీనిపై పలువురు హౌస్‌మేట్స్ కూడా అతడిని ఆట పట్టించారు. దీంతో ఈ లవర్ బాయ్ మరోసారి హైలైట్ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X