బిగ్ బాస్ తర్వాత హారికను తీసుకెళ్లిపోతానన్న అభిజీత్.. ఏకంగా ఆమె తల్లితోనే ఇలా.!

తెలుగు బిగ్ బాస్ షో ఎంతగా ప్రేక్షకాదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో లవ్ ట్రాకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మొదటి సీజన్ నుంచి ప్రస్తుతం ప్రసారం అవుతోన్న దాని వరకు ఇవే రేటింగ్ పెరగడానికి ఉపయోగపడ్డాయి. తాజా సీజన్‌లో మోనాల్ - అఖిల్, అభిజీత్ - హారిక, అవినాష్ - ఆరియానాలు ట్రాకులు నడుపుతున్నట్లు చూపిస్తుండడంతో షోకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అభిజీత్.. హారిక గురించి ఆమె తల్లితోనే షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం.!

స్టేజ్ మీద నుంచే మొదలెట్టిన అభిజీత్

స్టేజ్ మీద నుంచే మొదలెట్టిన అభిజీత్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ రోజు అభిజీత్‌కు మాత్రమే నాగార్జున ఓ గేమ్ పెట్టాడు. అందులో పలువురు హీరోయిన్లను చూపించి ఇందులో ఎవరిని పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించాడు. ఆ జాబితాలో ఉన్న మోనాల్‌ను వివాహమాడతానని అతడు వెల్లడించాడు. ఇది జరిగిన తర్వాత ఆమె బిగ్ బాస్ హౌస్‌లో కనిపించడంతో యంగ్ హీరో షాకైపోయాడు.

మోనాల్‌కు చెప్పేసి దగ్గరైపోయాడుగా

మోనాల్‌కు చెప్పేసి దగ్గరైపోయాడుగా

నాగార్జున తనతో ఆడించిన గేమ్ గురించి షో ఆరంభంలోనే మోనాల్‌ గజ్జర్‌కు చెప్పాడు అభిజీత్. దీంతో అప్పటి నుంచి ఆమెకు దగ్గరయ్యాడు. వీళ్లిద్దరూ చాలా రోజుల పాటు కలిసి మెలసి ఉన్నారు. బిగ్ బాస్ నిర్వహకులు కూడా వీళ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేసి మరీ చూపించారు. ప్రోమోలు ప్రత్యేకంగా కట్ చేశారు. దీంతో ఈ జంట ప్రేమాయణం సాగిస్తుందన్న టాక్ వినిపించింది.

 ఆమెకు అఖిల్... అభిజీత్‌కుకి హారిక

ఆమెకు అఖిల్... అభిజీత్‌కుకి హారిక

మోనాల్ - అభిజీత్ బంధం బలమవుతోన్న సమయంలో అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య దూరం ఏర్పడింది. ఈ సమయంలోనే అభిజీత్.. దేత్తడి హారికతో కలిశాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటున్నారు. అంతేకాదు, వీళ్లు ట్రాక్ నడుపుతున్నారు అని హౌస్‌మేట్స్ అనుకునేంతగా క్లోజ్ అయ్యారు. దీంతో వీళ్లూ హైలైట్ అవుతూనే ఉన్నారు.

హగ్గులు.. ముద్దులతో హాట్ టాపిక్

హగ్గులు.. ముద్దులతో హాట్ టాపిక్

ఒకవైపు బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ రొమాన్స్ చేస్తుండగా.. మరోవైపు అభిజీత్ - హారిక కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ హైలైట్ అవుతున్నారు. తరచూ కలిసి కూర్చుని మాట్లాడుతుండడం, హగ్గులు చేసుకోవడం, ముద్దులిచ్చుకోవడం వంటి వాటితో హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్యా ట్రాక్ నడుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

హారికను తీసుకెళ్లిపోతానన్న అభిజీత్

హారికను తీసుకెళ్లిపోతానన్న అభిజీత్

బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో హారిక తల్లి కూడా దీనిపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. ఇదే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎపిసోడ్‌లో అభిజీత్.. హారికను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
ఏకంగా ఆమె తల్లితోనే ఇలా అడిగాడు.!

ఏకంగా ఆమె తల్లితోనే ఇలా అడిగాడు.!

తాజా ఎపిసోడ్‌లో హారిక తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో అభిజీత్ మాట్లాడుతూ ‘ఆంటీ.. షో అయిపోయిన తర్వాత హారికను ఒక దగ్గరకు తీసుకెళ్తాను. దానికి మీరు పర్మీషన్ ఇవ్వాలి' అని అడిగాడు. దీనికి ఆమె వెంటనే ఓకే చెప్పేశారు. అంతేకాదు, ‘మీ ఫ్రెండ్‌షిప్ బాగుంది. ఫ్యూచర్‌లో కూడా ఇలాగే కలిసుండాలి' అని అభీతో చెప్పారామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X