అభిజీత్‌ను లవర్ బాయ్ అనేది ఇందుకే: ఏకంగా అంతమందితో అంటూ గుట్టు విప్పాడు

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలు అభిజీత్.. అభిజీత్ అనే నామస్మరణతో మారుమ్రోగిపోతోన్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా రాని గుర్తింపు ఇప్పుడు దక్కుతోంది. దీనికి కారణం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అతడు పాల్గొనడమే. ఈ షోలోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అసాధారణ ఆటతీరుతో అబ్బురపరిచాడు. ఫలితంగా ఈ సీజన్‌కు విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇదిలాఉండగా, తాజాగా జరిగిన ఓ టాస్కులో భాగంగా తన ప్రేమ కథలను రివీల్ చేశాడు. అంతేకాదు, ప్రియురాళ్ల పేర్లను కూడా వెళ్లడించాడు అభిజీత్. ఆ వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ.. పెళ్లిగోలతో బాగా ఫేమస్

అలా ఎంట్రీ.. పెళ్లిగోలతో బాగా ఫేమస్

స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఆ తర్వాత ‘రామ్ లీలా', ‘మిర్చి లాంటి కుర్రాడు' వంటి సినిమాల్లో నటించాడు. కానీ, ఇవేమీ అతడి కెరీర్‌కు ప్లస్ అవలేదు. అయితే, వర్షిణితో కలిసి చేసిన ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో మూడు సీజన్లు పూర్తి చేసుకుందీ సిరీస్.

బిగ్ బాస్‌లో మొదటి రోజే మొదలెట్టి

బిగ్ బాస్‌లో మొదటి రోజే మొదలెట్టి

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. మొదటి రోజు స్టేజ్ మీద ఉన్న సమయంలోనే నాగార్జున.. ముగ్గురు హీరోయిన్ల ఫొటోలను చూపించి ఇందులో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అతడిని ప్రశ్నించాడు. దీనికి మోనాల్ గజ్జర్‌ పేరు చెప్పాడు. హౌస్‌లోకి వెళ్లినప్పుడే ఆమెకీ విషయం చెప్పి ఇంప్రెస్ చేశాడు.

ఆ ఇద్దరితో ట్రాకుల వల్ల పాపులారిటీ

ఆ ఇద్దరితో ట్రాకుల వల్ల పాపులారిటీ

నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో ఎంతో క్లోజ్‌గా ఉండేవాడు అభిజీత్. ఆ సమయంలోనే ఆమెతో ట్రాక్ నడుపుతున్నట్లు బాగా ప్రచారం జరిగింది. సరిగ్గా అప్పుడే అఖిల్ సార్థక్ ఎంట్రీతో మోనాల్ అతడి వైపు వెళ్లిపోయింది. ఆ తర్వాత అభిజీత్.. దేత్తడి హారికతో క్లోజ్ అయ్యాడు. ఇలా ఈ సీజన్‌లో ఇద్దరు అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ పాపులర్ అయిపోయాడు.

ఒక్క టాస్కుతో పెరిగిన ఫాలోయింగ్

ఒక్క టాస్కుతో పెరిగిన ఫాలోయింగ్


ఈ సీజన్ మొదటి దశలో జరిగిన రోబో టాస్కులో మైండ్ గేమ్ ఆడి అభిజీత్ తన జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి ప్రతి టాస్కులోనూ కండ బలం కంటే బుద్ది బలానికే ప్రాధాన్యం ఇస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఈ కారణంగానే అతడికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. అదే సమయంలో ఫిజికల్ గేమ్స్ ఆడలేడన్న కారణంతో అభినీ తరచూ నామినేట్ చేస్తున్నారు కంటెస్టెంట్లు.

అభీని లవర్ బాయ్ అనేది ఇందుకే

అభీని లవర్ బాయ్ అనేది ఇందుకే


అభిజీత్‌ను లవర్ బాయ్ అంటుంటారు. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో ట్రాకులు నడపడం వల్ల కాదు.. బయట కూడా అదే పేరు ఉండడమే అని తెలిసిందే. మరీ ముఖ్యంగా అతడికి అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో బాగా పాపులారిటీ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో షోలో జరిగిన ఓ టాస్కులో అతడు తన ప్రేమ కథలు, ప్రియురాళ్ల పేర్లు చెప్పి షాకిచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
అంతమందితో అంటూ గుట్టు విప్పాడు

అంతమందితో అంటూ గుట్టు విప్పాడు


శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రియల్ మ్యాంగో జ్యూస్ వాళ్లు ట్రూత్ ఆర్ డేర్ అనే టాస్కును ఆడించారు. ఇందులో భాగంగా అభిజీత్‌ను తన ప్రేమ కథలు చెప్పమని అడిగారు కంటెస్టెంట్లు. దీంతో చదువుకునే రోజుల్లో ఏకంగా ఏడాదికొకరిని లవ్ చేశానని చెప్పాడు. అంతేకాదు, వాళ్ల పేర్లు కూడా రివీల్ చేశాడు. దీంతో హారికతో సహా కంటెస్టెంట్లు అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X