Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మోనాల్ బండారం బయటపెట్టిన అభిజీత్: ఆ సీన్లు ఎందుకు చూపించలేదు? ఇంకా సస్పెన్స్‌గానే!
ఫినాలేకు చేరువ అవుతోన్న కొద్దీ బిగ్ బాస్ షోలో ఆసక్తికరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, సరికొత్త టాస్కులు, ఊహకందని అంశాలతో నాలుగో సీజన్ రంజుగా సాగుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఎన్నో సీక్రెట్స్ లీక్ చేస్తుంగా.. హౌస్‌లో సైతం ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పుడూ కూల్‌గా ఉండే అభిజీత్.. తాజా ఎపిసోడ్లో మోనాల్ బండారం బయట పెట్టాడు. అయితే, అతడు చెప్పిన సీన్లు షోలో ప్రసారం చేయలేదు. దీంతో బిగ్ బాస్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం!
రేస్ టు ఫినాలే.. తుది పోరులో ఇద్దరు
ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ పోరులో అవినాష్, ఆరియానా, మోనాల్‌లు నిష్క్రమించారు. రెండో రౌండ్లో పోరాడినా అభి, హారిక ఔట్ అయ్యారు. దీంతో సోహెల్, అఖిల్ తుది పోరుకు అర్హత సాధించారు.
అవినాష్ వ్యవహారంతో హౌస్‌లో గొడవ
మొదటి రౌండ్లో ఆవు పాలను పట్టుకునే సమయంలో అవినాష్.. మోనాల్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడిని కాలితో తన్నిందని పెద్ద రాద్దాంతమే చేశాడతను. ఈ వ్యవహారం తర్వాత రోజు కూడా కొనసాగింది. ఈ విషయంలో అవినాష్ అస్సలు తగ్గలేదు. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఆ వీడియోను ప్లే చేయాలని పలుమార్లు రిక్వెస్ట్ చేశాడు కూడా.
ఆ వ్యవహారంపై అభిజీత్ స్పందన ఇలా
అవినాష్‌కు ఇటీవలి కాలంలో బాగా దగ్గరయ్యాడు అభిజీత్. అందుకే తరచూ వాళ్లిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా సలహా కావాలన్నా అతడినే అడుగుతున్నాడీ జబర్ధస్త్ కమెడియన్. ఈ నేపథ్యంలోనే మోనాల్ గజ్జర్‌తో జరిగిన వ్యవహారంలో అవినాష్‌కు మద్దతు తెలిపాడు అభి. అసలే బాధలో ఉన్నోడిని ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.
మోనాల్ బండారం బయటపెట్టిన అభి
అవినాష్ - మోనాల్ గజ్జర్ వ్యవహారంపై అభిజీత్, సోహెల్ మధ్య డిస్కర్షన్ జరిగింది. ఆ సమయంలో ‘మోనాల్ బాగా అబద్ధాలు చెబుతుంది బ్రదర్. ఆమెకు మెహబూబ్ దగ్గర ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావ్? ఏం జరిగింది అనుకుంటున్నావ్? మెహబూబ్ నాకు క్లోజ్ ఎందుకు అనుకుంటున్నావ్?' అంటూ పరోక్షంగా ఆమె పుల్లలు పెట్టిందని చెప్పుకొచ్చాడు
వాళ్ల సీన్లు ఎందుకు చూపించలేదు?
వాస్తవానికి మోనాల్ గజ్జర్ ఆ మధ్య సోహెల్ - అఖిల్ వ్యవహారంలోనూ తలదూర్చింది. అంతేకాదు, వాళ్లిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియోలు చూపించిన నాగ్.. అసలు విషయం బయట పెట్టాడు. ఇక, ఇప్పుడు అభిజీత్ కొన్ని విషయాలు వెల్లడించడంతో.. అసలు ఆ వీడియోలు ఎందుకు ప్రసారం చేయలేదని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఇంకా సస్పెన్స్‌గానే.. వాళ్లిద్దరి స్నేహం
అభిజీత్ - మెహబూబ్ మధ్య మంచి బాండింగ్ ఉందన్న విషయం అతడు ఎలిమినేట్ అయ్యే వరకు తెలియదు. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఆ ఎపిసోడ్లో తొలిసారి అభి కంట నీరు కనిపించింది. ఆ తర్వాత బయట జరిగిన ఇంటర్వ్యూల్లో కూడా మెహబూబ్.. అతడిని అన్నయ్యలా సంబోధించాడు. కానీ, వాళ్లిద్దరి మధ్య బంధం పెరగడానికి గల అసలు కారణాలు సస్పెన్స్‌గానే ఉంచాడు.