Just In
- 46 min ago
ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్: ఆ పేరుతో కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఇలా!
- 2 hrs ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 2 hrs ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 2 hrs ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
Don't Miss!
- News
యూజర్ల దెబ్బ... ప్రైవసీ పాలసీ విషయంలో వెనక్కు తగ్గిన వాట్సప్
- Lifestyle
మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి రోజుకు ఎన్నిసార్లు తినాలో మీకు తెలుసా?
- Finance
సరికొత్త రికార్డును తాకిన HCL టెక్, కొత్తగా 20,000 ఉద్యోగాలు
- Sports
పాండ్యా సోదరుల ఇంట విషాదం.. టోర్నీ మధ్యలోంచి ఇంటికెళ్లిన కృనాల్!!
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజీత్ ఊహించని నిర్ణయం: అతడి తీరుకు ఆశ్చర్యపోతోన్న సినీ పెద్దలు.. దాని కోసమే ఇదంతా!
బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో బిగ్ బాస్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఇందులో కంటెస్టెంట్లుగా వచ్చే వారి నిజస్వరూపాలను బయటపెట్టడంతో పాటు ఎంతో మందిని హీరోలను చేసిందీ షో. ఇలా ప్రతీ సీజన్‌లో ఎవరో ఒకరు పాపులర్ అవుతున్నారు. ఇక, ఇటీవల ముగిసిన దానిలో మాత్రం యంగ్ హీరో అభిజీత్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా విజేతగానూ నిలిచాడు. బయటకు వచ్చాక అతడికి సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఈ నేపథ్యంలో సినిమాల విషయంలో అభిజీత్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

లవర్ బాయ్‌ను అందరూ లైట్ తీసుకున్నారు
యంగ్ హీరో అభిజీత్‌కు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌కు దూరమైపోయాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ప్రసారం అయిన నాలుగో సీజన్‌కు కంటెస్టెంట్‌గా వచ్చాడు. షో ఆరంభంలో అతడు అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ.. లవర్ బాయ్‌లా ఉంటాడని అంతా అనుకున్నారు. దీంతో అతడిపై ప్రేక్షకులు, కంటెస్టెంట్లు పెద్దగా ఫోకస్ చేయలేదు.

ఒక్క సందర్భంలో హీరో.. వాళ్లు టార్గెట్ చేశారు
సీజన్ ఆరంభంలో జరిగిన రోబోట్ టాస్కులో అభిజీత్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది. తన జట్టును గెలిపించడం కోసం ప్రత్యర్థుల్లో ఒకరైన దివి వాద్యాను కిడ్నాప్ చేశాడు. గేమ్ కోసం మైండ్‌ను వాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే ఎదుటి టీమ్‌లోని చాలా మంది కంటెస్టెంట్లు అతడిని టార్గెట్ చేశారు. ఈ కారణం చెప్పే పలుమార్లు అభిజీత్‌తో గొడవలకు దిగారు.

ప్రేక్షకులకు చేరువ... గుద్ది పడేసి గెలిపించారు
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎప్పుడూ కామ్‌గా ఉంటూ మిస్టర్ కూల్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు అభిజీత్. అదే సమయంలో అతడు ఏకంగా 11 సార్లు నామినేట్ అవడంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. దీంతో అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇలానే అభిజీత్‌ను సీజన్ విన్నర్‌ను చేశారు. గత రెండు సీజన్లలోనూ 11 సార్లు నామినేట్ అయిన వాళ్లే గెలవడం విశేషం.

ఫుల్ బిజీ అయిన అభిజీత్... వరుస ఆఫర్లతో
బిగ్ బాస్ హౌస్ నుంచి విన్నర్‌గా బయటకు వచ్చిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయ్యాడు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. వెంకీ కుడుములతో మూవీ ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

ఊహించని నిర్ణయం తీసుకున్న హీరో అభిజీత్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన అభిజీత్.. తన దృష్టి మొత్తం సినిమాల్లో రాణించడంపైనే ఉందని ఎన్నోసార్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకూ తన సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి సమయంలో అభిజీత్ తన మూవీ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.

అభిజీత్ తీరుకు ఆశ్చర్యపోతోన్న సినీ పెద్దలు
భారీ సినిమా ద్వారా టాలీవుడ్‌కు రీలాంఛ్ అవ్వాలని అభిజీత్ భావిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు.. అలాంటి మూవీ వచ్చే వరకూ రీఎంట్రీ ఇవ్వకూడదని అతడు నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగానే అతడికి వస్తున్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నాడని సమాచారం. అభిజీత్ తీరుకు సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారని టాక్.