దేత్తడి హారికకు భారీ షాకిచ్చిన అభిజీత్: బిగ్ బాస్‌లో అలా.. ఇప్పుడిలా.. ఏదో తేడాగా కొడుతుందే!

హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు తెలుగు కుర్రాడు అభిజీత్. దీంతో సినిమాలకు దూరమైన అతడు.. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇవ్వడం.. అందులో విజేతగా నిలవడం జరిగిపోయాయి. ఇక, హౌస్‌లో ఉన్న సమయంలో అతడు దేత్తడి హారికతో ఎంతో చనువుగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆమె తన సోదరి లాంటిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో హారికకు మరోసారి షాకిచ్చాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

 ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనుకుంటే తేడా కొట్టింది

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనుకుంటే తేడా కొట్టింది

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. అయితే, ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి చిత్రాల్లో నటించినా.. అవి హిట్‌ను మాత్రం అందించలేదు. దీంతో టాలీవుడ్‌కు దూరం అయ్యాడు అభిజీత్. అదే సమయంలో అతడు చేసిన 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ... అప్పుడే మెప్పించాడు

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ... అప్పుడే మెప్పించాడు

సినిమాల్లో నటించకున్నా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు అభిజీత్. ఏమాత్రం అంచనాలు లేకుండా లోపలికి వెళ్లిన ఈ కుర్రాడు.. అద్భుతమైన మైండ్ గేమ్‌తో అదరగొట్టేశాడు. ఇలా చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. వ్యక్తిగతంగా, ఆట పరంగా మంచి పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు.

ప్రేక్షకుల మద్దతులో విజయం... కెరీర్‌పైనే ఫోకస్

ప్రేక్షకుల మద్దతులో విజయం... కెరీర్‌పైనే ఫోకస్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన వాళ్లంతా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. అదే సమయంలో అభిజీత్ ఎనలేని క్రేజ్‌ను అందుకుని సత్తా చాటాడు. దీంతో ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఓట్లు సాధించి బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతం కెరీర్‌పై బాగా ఫోకస్ చేస్తున్నాడు.

దేత్తడి హారికతో ట్రాక్‌తో హైలైట్.. మెసేజ్ రాశాడు

దేత్తడి హారికతో ట్రాక్‌తో హైలైట్.. మెసేజ్ రాశాడు

షోలోకి ప్రవేశించినప్పటి నుంచే హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు అభిజీత్. అలా కొద్ది రోజుల పాటు ఆమెతో క్లోజ్‌గా ఉన్న అతడు.. ఆ తర్వాత దేత్తడి హారికకు దగ్గరయ్యాడు. అప్పటి నుంచి దాదాపు షో ముగిసే వరకూ ఆమెతో ప్రేమాయణం సాగించినట్లుగా వ్యవహరించాడు. దీంతో వీళ్లిద్దరి పేర్లను కలిపి 'అభిక'గా ట్రెండ్ సెట్ చేశారు ఇరువురి ఫ్యాన్స్.

Recommended Video

Bigg Boss నుండి వచ్చాక కెరీర్ ఉండదు అంటారు.. కానీ Divi Vadthya విషయం లో ఇది తప్పు
హారికను సోదరి అన్నాడు.. ఆమె కూడా అలాగే

హారికను సోదరి అన్నాడు.. ఆమె కూడా అలాగే

బిగ్ బాస్ హౌస్‌లో దేత్తడి హారికతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అభిజీత్.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఊహించని విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఆమె తనకు సోదరి అని షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో అందరూ అవాక్కైపోయారు. అదే సయమంలో హారిక కూడా మేము బ్రదర్ అండ్ సిస్టర్‌లానే వ్యవహరించే వాళ్లం అని చెబుతూ బిగ్ బాస్‌పై విమర్శలు చేసింది.

 దేత్తడి హారికకు భారీ షాకిచ్చిన బిగ్ బాస్ విన్నర్

దేత్తడి హారికకు భారీ షాకిచ్చిన బిగ్ బాస్ విన్నర్

బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. నాలుగో సీజన్ అత్యధిక రేటింగ్‌తో నేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఉత్సవం పేరిట స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి కంటెస్టెంట్లు అందరూ హాజరయ్యారు. ఇందులో దేత్తడి హారికకు అభిజీత్ భారీ షాక్ ఇచ్చాడు. దీంతో అందరూ మరోసారి అవాక్కయ్యారు.

బిగ్ బాస్‌లో అలా... ఇప్పుడిలా... తేడాగా ఉందే

బిగ్ బాస్‌లో అలా... ఇప్పుడిలా... తేడాగా ఉందే

ఈ ఈవెంట్‌లో భాగంగా యాంకర్ శ్రీముఖి.. అభిజీత్‌ను 'బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎవరిని బాగా మిస్ అయ్యావ్' అని ప్రశ్నించింది. దీనికి అతడు నోయల్ అని బదులిచ్చాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు హారికను మిస్ అవుతున్నానని లెటర్లు రాసిన అభిజీత్.. ఇప్పుడిలా అనడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X