ఎలిమినేటైన ఆ కంటెస్టెంట్‌కు అభిజీత్ ఎమోషనల్ నోట్: తొలిసారి అలా కనిపించిన మిస్టర్ కూల్

బిగ్ బాస్ చరిత్రలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో అభిజీత్ ఒకడు. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అద్భుతమైన ఆట తీరుతో పాటు ఆకట్టుకునే వ్యవహార శైలితో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. గొడవల్లో భాగంగా కాకుండా, భావోద్వేగాలను ఎక్కడి వరకు వ్యక్త పరచాలో అంతే చూపిస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఫినాలేకు చేరుకున్న అభిజీత్.. కొద్ది రోజుల క్రితం ఎలిమినేటైన ఓ కంటెస్టెంట్‌కు ఎమోషనల్ నోట్ రాశాడు. అంతేకాదు, తొలిసారి తనలోని మరో యాంగిల్ చూపించాడు. ఆ వివరాలు మీకోసం!

లవ్ ట్రాకులతో లవర్ బాయ్‌గా గుర్తింపు

లవ్ ట్రాకులతో లవర్ బాయ్‌గా గుర్తింపు

కొన్ని సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోగా సుపరిచితుడు అయ్యాడు అభిజీత్. ఇండస్ట్రీలో లక్ పెద్దగా కలిసి రాకపోవడంతో చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఆరంభంలోనే మోనాల్ గజ్జర్, దేత్తడి హారికతో లవ్ ట్రాకులు నడిపి లవర్‌ బాయ్‌గా పేరొందాడు.

 మంచి పేరుతో పాటు విమర్శలు కూడా

మంచి పేరుతో పాటు విమర్శలు కూడా

అభిజీత్ చాలా కామ్‌గా ఉంటాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలని చూడడు. ఇదే అతడికి మంచి పేరును తీసుకొచ్చింది. అలాగే, టాస్కుల్లో మైండ్ పెట్టి గేమ్ ఆడడంతో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, ఫిజికల్ టాస్కుల్లో సరిగా ఆడలేడన్న కారణంతో అభిపై కంటెస్టెంట్లు విమర్శలు కూడా చేశారు. దీనిని ఉద్దేశించి చాలా సార్లు అతడిని నామినేట్ కూడా చేశారు.

 వాళ్లతోనే క్లోజ్‌గా.. అంతా వెళ్లిపోవడంతో

వాళ్లతోనే క్లోజ్‌గా.. అంతా వెళ్లిపోవడంతో

బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. పెద్దగా ఎవరితోనూ కలిసుండడు. కానీ, షో ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉన్నాడు. ఆమె దూరమైన తర్వాత హారికతో కలిశాడు. అదే సమయంలో నోయల్ సీన్, లాస్య మంజునాథ్‌లతోనూ స్నేహంగా ఉండేవాడు. వీళ్లలో ఇద్దరు ఎలిమినేట్ అవడంతో హారికతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

 వెళ్లిపోయి సపోర్ట్ చేస్తున్న స్నేహితులు

వెళ్లిపోయి సపోర్ట్ చేస్తున్న స్నేహితులు

ఎలిమినేషన్ సమయంలో నోయల్ సీన్.. అభిజీత్ గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు, ‘నీ భుజం ఎప్పుడు నొప్పిగా అనిపించినా.. నేను నీకు భుజంలా నిలబడతా' అంటూ ప్రామిస్ చేశాడు. అందుకు అనుగుణంగానే అతడు.. అభిజీత్‌ను సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే, హారికకూ ఓట్లు వేయిస్తున్నాడు. అతడితో పాటు లాస్య కూడా వీళ్లిద్దరికీ మద్దతుగా పోస్టులు పెడుతోంది.

ఆ కంటెస్టెంట్‌కు అభీ ఎమోషనల్ నోట్

ఆ కంటెస్టెంట్‌కు అభీ ఎమోషనల్ నోట్

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే సమయంలో జుట్టు కత్తిరించుకోవద్దని నోయల్.. అభిజీత్‌కు చెప్పాడు. అందుకు అనుగుణంగానే అతడు ఇప్పటి వరకూ హెయిర్ కట్ చేసుకోలేదు. అలాగే, అతడు ఇచ్చిన బట్టలను ఇప్పటికీ దాచుకున్నాడు. ఇలా ఫ్రెండ్‌షిప్‌కు సరైన అర్థం చెబుతున్నాడతను. ఈ నేపథ్యంలో తాజాగా నోయల్ కోసం ఎమోషనల్‌గా ఓ నోట్ రాశాడు అభిజీత్.

తొలిసారి అలా కనిపించిన మిస్టర్ కూల్

తొలిసారి అలా కనిపించిన మిస్టర్ కూల్

తాజా ఎపిసోడ్‌లో నోయల్‌ గురించి బాధ పడుతూ ‘My Journey Feel less With Out You Star Boy' అని వాటర్ బాటిల్‌పై నెయిల్ పాలీస్‌తో రాశాడు అభిజీత్. ఆ సమయంలో తొలిసారి భారమైన హృదయంతో కనిపించాడను. అప్పుడు హారిక వచ్చి అతడిని ఓదార్చింది. ఈ విషయాన్ని నోయల్ సోషల్ మీడియా ద్వారా స్పందించి.. అతడి స్నేహానికి సలామ్ కొట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X