బ్యాంక్ బ్యాలెన్స్ చూసి సినిమా చేద్దామని రాజమౌళి

దానికి సమాధానంగా కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రముఖ దర్శకుడైన రాజమౌళి. నేను అప్పటికే మొత్తం పోగొట్టుకుని ఉన్నాను. ఆ సమయంలో 'మంచి ప్రాజెక్టు తెచ్చుకో ఎన్నికోట్లయినా పెడతా'నని ఓ ఫైనాన్షియర్ నాకు ఆఫర్ ఇచ్చారు. దాంతో నేను రాజమౌళి కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో మాట్లాడాను. కానీ, 'వద్దండి, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న నిర్మాత అయితే బాగుంటుంది' అన్నారు. దాంతో ఇక వదిలేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు గానీ, అనుకూల అవకాశం వస్తే సినిమా తీయాలనే ఉద్దేశం ఉంది అన్నారు.
ఆయన ప్రస్తుత సిని పరిస్దితి గురించి చెప్తూ... ఇప్పుడు నిర్మాత లొకేషన్‌కు వస్తే.. హీరోలు, డైరెక్టర్లు ఏదో చీడపురుగును చూసినట్లు చూస్తారు. చాలా మంది హీరోలు వ్యవహరించే పద్ధతే బాగుండదు. ఒక్క సినిమా హిట్టయితే చాలు.. 'బాబు'లు అయిపోతారు. సినిమా పరిశ్రమలోకి బయటి నుంచి వస్తున్న సొమ్మే.. హీరోల రెమ్యునరేషన్ పెరిగిపోవడానికి కారణం. డైరెక్టర్లు కూడా నిర్మాతల బ్యాంకు బ్యాలెన్స్ చూసే.. డేట్లు ఇస్తున్నారు అన్నారు.
ఇక నేను మొత్తం 32 సినిమాలు తీశాను. చివరిలో నాలుగు సినిమాలు వరుసగా పోయాయి. అందులో తమిళంలో తీసిన 'లక్కీమాన్', తెలుగులో అర్ధాంగి సినిమాలతో దాదాపు మొత్తం పోగొట్టుకున్నాను. చివరికి తెలుగులో.. 'సింగన్న'తో 15 ఏళ్ల కింద సినిమా నిర్మాణం ఆపేశాను. నటులు, టెక్నీషియన్లు నిర్మాతకు అనుకూలంగా ఉండాలి అన్నారు. కాట్రగడ్డ ప్రసాద్ అప్పట్లో సుమన్ అరెస్టై బెయిల్ మీద ఉన్నప్పుడు... ఆయనతో 'బందిపోటు' చిత్రం తీసి హిట్ కొట్టి సుమన్ తోనే వరస సినిమాలు చేసారు.


Click it and Unblock the Notifications











