ఓపెన్ డిబేట్‌కు ఉత్తమ కార్యక్రమ అవార్డు

ప్రసారమాధ్యమం శక్తిమంతమైనదని, ఇందులో పనిచేసే సాంకేతిక నిపుణులు, కళాకారులు, నిర్మాతలను ప్రోత్సహిస్తున్న ఆరాధన శ్రీకరి సంస్థ నిర్వాహకుడు కృష్ణయ్య అభినందనీయుడని ప్రశంసించారు. మృదులకు స్వర్ణకంకణ ప్రదానం, సీరియల్ దర్శకులకు, నటీ నటులకు అవార్డులు అందజేశారు. నటుడు సుమన్, దయాకర్, నరేందర్,రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పలు విషయాలు,వివాదాలు చర్చకు వస్తున్నాయి. గతంలో తెలుగు సినిమాల విషయంలో వివాదాలు రేకెత్తినప్పుడు ఓపెన్ డిబేట్ నిర్వహించారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేసేందుకు ఫిల్మ్ చాంబర్‌కు అనుబంధంగా ఓ శాశ్వత కమిటీని ఏర్పాటు చేసేందుకు సినీపెద్దలు అంగీకరించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కుల, మత, ప్రాంత చైతన్యం ఎక్కువ కాబట్టి.. వాటిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు రూపొందించాలనే విషయంలో ఓపెన్ డిబేట్ లో ఏకాభిప్రాయానికి వచ్చారు.


Click it and Unblock the Notifications











