తమిళ బిగ్ బాస్ సెట్లో అపశృతి: ఒకరు మృతి... పోలీసు విచారణ!
కమల్ హాసన్ హెస్ట్‌గా రన్ అవుతున్న 'బిగ్ బాస్ తమిళ్ 2'లో అపశృతి చోటు చేసుకుంది. ఈ షో క్రూ మెంబర్ ఒకరు శనివారం మరణించారు. శుక్రవారం సాయంత్రం సెట్‌లో సెకండ్ ఫ్లోర్ నుండి పడిపోయిన తీవ్రగాయాలైన సదరు వ్యక్తి శనివారం కన్నుమూశాడు.
చనిపోయిన వ్యక్తి ని ఏసీ మెకానిక్ గుణశేఖరన్‌గా గుర్తించారు. ఏసీకి సంబంధించి సమస్య ఏర్పడటంతో దాన్ని బాగుచేయడానికి పైకి ఎక్కిన గుణశేఖర్ ప్రమాద వశాత్తు క్రిందపడిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న గుణశేఖరన్ శనివారం మధ్నాహ్నం కన్నుమూశారు. గుణశేఖరన్ తమిళనాడులోని అరియలూరు వాసి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నజరెత్‌పేట్ పోలీసులు విచారణ జరుపుతునప్నారు. చెన్నైలోని ఈవిపీ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ షో జరుగుతోంది.
బిగ్ బాస్ తమిళ్ మొదటి సీజన్ ముంబైలో జరిగిన సమయంలో కూడా 28 ఏళ్ల ఒక ప్లంబర్ ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సీజన్‌కు మరొకరు మరణించడం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











