Just In
- 2 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 3 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 3 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 3 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఢీ’ డ్యాన్స్ షోలో ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కింద పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు.. ఆ పొరపాటు వల్లే దుర్ఘటన
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాలైన షోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణను అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'ఢీ' ఒకటి. దాదాపు పదేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోన్న ఈ షో.. ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. తద్వారా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాలో ఫుల్ పాపులర్ అయిపోయిందీ షో. ఇలాంటి పరిస్థితుల్లో తొలిసారి 'ఢీ' షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయింది. ఆ వివరాలు మీకోసం!

సౌతిండియాలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాలి షో
బుల్లితెర చరిత్రలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘ఢీ'. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. దీనికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ.. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఇది వరుస సీజన్లతో దూసుకుపోతోంది.

ఎంతో మంది కొరియోగ్రాఫర్లను అందించిన షో
ఢీ షో వల్ల ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లకు ఓ ఫ్లాట్‌ఫాం దొరుకుతుంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా ‘ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా మారారు. వీరిలో మొదటి ముగ్గురు టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రచ్చ చేస్తున్నారు.

పన్నెండు కంప్లీట్.. పదమూడో సీజన్ స్టార్ట్స్
ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘ఢీ' షో.. పదమూడో సీజన్‌ను కూడా ప్రారంభించింది. ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్‌కు మరింత మంది అభిమానులు వచ్చి చేరుతున్నారు.

యాంకర్.. టీమ్ లీడర్లు.. జడ్జ్‌లు ఎవరంటే?
‘కింగ్ వర్సెస్ క్వీన్స్' సీజన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. అబ్బాయిల టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మెంటర్లుగా.. అమ్మాయిల జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దీనికి జడ్జ్‌లుగా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు.

‘ఢీ’ డ్యాన్స్ షోలో ఘోర ప్రమాదం.. ప్రోమోలో
వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఢీ - కింగ్ వర్సెస్ క్వీన్స్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో పలువురు కంటెస్టెంట్లు చేసిన డ్యాన్స్‌ను చూపించారు. అలాగే, ఇందులో యాంకర్ టీమ్ లీడర్ల మధ్య జరిగిన కామెడీని కూడా యాడ్ చేశారు. ఇక, ఈ ప్రోమో చివర్లో షోలో జరిగిన ఓ ఘోర ప్రమాదాన్ని చూపించారు. దీంతో నిర్వహకులతో పాటు ప్రేక్షకులు షాకౌతున్నారు.

కింద పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు
‘ఢీ - కింగ్ వర్సెస్ క్వీన్స్' షోలో ప్రతి ఒక్కరూ ప్రాణాలను పణంగా పెట్టి డ్యాన్స్ చేస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగానే ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ లేడీ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ స్టేజ్ కిందకు పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయం అయింది. దానికి సంబంధించిన విజువల్స్‌ను ప్రోమోలో చూపించారు నిర్వహకులు.
ఆమె చేసిన ఈ పొరపాటు వల్లే దుర్ఘటన
ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఫినిషింగ్ ఇచ్చే సమయంలో స్టేజ్ పైనుంచి కిందకు దూకాల్సి ఉంది. అక్కడ మెత్తటి పరుపులు కూడా వేశారు. కానీ, ఆమె అంచనా తప్పి తల నేలకు తగిలేలా దూకింది. దీంతో ఆ కంటెస్టెంట్ తలకు గాయం అవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని సమాచారం.