Bigg Boss 17 సల్మాన్ షోలో తెలంగాణ బిడ్డ అచానక్ భయానక్.. కంటెస్టెంట్లకు హైదరాబాదీ బిర్యానీ తడాఖా!

బిగ్‌బాస్ హిందీ సీజన్ 17 హైదరాబాద్‌కు చెందిన అచానక్ భయానక్ అనే కంటెస్టెంట్‌ తనదైన శైలిలో రాణిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు, అలాగే హిందీ వినోద పరిశ్రమలో రాణిస్తున్న సెలబ్రిటీలతో సమానంగా పోటీ పడుతూ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అసలు అచానక్ భయానక్ అంటే ఏమిటి? ఆయన ఈ పేరు ఎందుకు పెట్టుకొన్నాడు? అతడి అసలు పేరు ఏమిటి అనే విషయాల్లోకి వెళితే..

అచానక్ భయానక్ పేరుతో గేమర్‌గా, యూట్యూబర్‌గా సుపరిచితులు. ఆయన అసలు పేరు అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి. ‌బిగ్‌బాస్ 17లోకి 15వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకొనడమే కాకుండా సెలబ్రిటీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం అచానక్ భయానక్ ఉత్తరాదిలో తనకంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం గమనార్హం.

Achanak Bhayanak alias Arun Srikanth Mashettey trending in Salman Khans Bigg Boss 17

బిగ్‌బాస్‌లోకి వచ్చిన అరుణ్ శ్రీకాంత్‌తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ అచానక్ భయానక్ అంటే ఏమిటి? అంటే.. ఏదైనా నా ముందుకు ఓ విషయం సడెన్‌గా వస్తే.. నేను దానిని భయానక్‌గా మార్చి యూట్యూబ్‌లో వైరల్ చేస్తాను. గేమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాదీ తరహా వినోదాన్ని అందిస్తానని అన్నాడు.

ఉత్తరాది సెలబ్రిటీలను, సినీ సెలబ్రిటీలను ఎలా ఎదురిస్తావు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దక్కన్ ప్రజల అండ ఉంది. తెలంగాణ, ఆంధ్ర కర్ణాటక ప్రజల విశేష ఆదరణ ఉంది. వారి అండతో హైదరాబాదీ బిర్యానీ తడఖా చూపిస్తాను. బిర్యానీలో నిమ్మకాయ పిండినట్టు, మసాలా కలిపినట్టు ఎవరైనా ఎదురొస్తే.. వారికి టక్కర్ ఇస్తాను అంటూ ధీమాను వ్యక్తం చేశాడు.

Achanak Bhayanak alias Arun Srikanth Mashettey trending in Salman Khans Bigg Boss 17

దాంతో అచానక్ భయానక్ బిగ్‌బాస్ హౌస్‌కు కరెక్ట్ అంటూ తనదైన శైలిలో సల్మాన్ ఖాన్ ప్రశంసలు గుప్పించారు. తాను చెప్పినట్టే.. ఇంటిలో హైదరాబాదీ బిర్యానీ తడాఖా చూపిస్తున్నాడు. ఇంటిలో పేరున్న సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ కాంపిటీషన్‌లో అచానక్ భయానక్ ఏ రేంజ్‌లోకి దూసుకెళ్తాడో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ హౌస్‌లో అచానక్ భయానక్ అంటూ క్రేజీగా మారిన అరుణ్ మాశెట్టి భార్య మాలక్ షేర్ చేసిన వీడియో ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది. వారిద్దరి నిశ్చితార్థం వీడియోకు మంచి రెస్సాన్స్ వచ్చింది. అరుణ్ మాశెట్టి చేసిన డ్యాన్స్ కూడా క్యూట్‌గా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X