twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya Trailer: ఆ థియేటర్లలో ముందే విడుదల.. యూట్యూబ్‌లో వచ్చేది ఎప్పుడంటే!

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలోనే బోలెడన్ని విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నారు. అయితే, కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు గ్యాపిచ్చిన మెగాస్టార్.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు.

    <strong>Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం.. అసలు మేటర్ ఇదే!</strong>Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం.. అసలు మేటర్ ఇదే!

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. దేవాదాయ భూముల ఆక్రమణలపై నక్సలైట్లు చేసే ఉద్యమం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో టాకీ పార్టును మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం చేసేశారు.

    Acharya Trailer Youtube Version Release Time

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఎన్నో రికార్డులు నమోదు కావడంతో పాటు సోషల్ మీడియాలో ఇవన్నీ తెగ ట్రెండ్ అయిపోయాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!

    'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక, తాజాగా దీనికి సంబంధించిన మరో గుడ్ న్యూస్‌ను వెల్లడించారు. ఇందులో ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 12న సాయంత్రం 5.49 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని మేజర్ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఇది వరకే పేర్కొన్నారు. తాజాగా దీన్ని యూట్యూబ్‌లో ఎప్పుడు విడుదల చేస్తారో వెల్లడించారు. ఇక, ఈ ట్రైలర్‌ను ఏప్రిల్ 12న సాయంత్రం 7:02 గంటలకు తీసుకు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

    మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన 'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

    English summary
    Chiranjeevi, Ram Charan Did Acharya movie Under Koratala Siva Direction. This Movie Trailer Youtube Version Release Time Revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X