Bigg Boss Telugu 7 ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్.. రతిక అందమైన విషసర్పం.. షకీలా సంచలన కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో అందరూ ఊహించినట్టుగానే రెండోవారం ఎలిమినేషన్ జరిగింది. ఇంటిలో వీక్ కంటెస్టెంట్‌గా కనిపించిన షకీలా రెండోవారం హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఫైర్ బ్రాండ్ షకీలా అంటే మంచి కంటెంట్ ఉంటుందని అంచనాలు పెంచుకొన్న ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన షకీలా నేరుగా బిగ్‌బాస్ బజ్‌లోకి వెళ్లి గతూ రాయల్‌తో ముచ్చటించింది. గీతూ, షకీలా మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ప్రోమోలోకి వెళితే..

ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ప్రశ్నించి.. నిలదీసే ప్రయత్నాలతో ఉన్న యాంకర్ గీతూ రాయల్ పప్పులను షకీలా ఉడకనివ్వలేదు. బోనులో ఖైదీలా విచారించాలనుకొన్న గీతూ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టు కనిపించింది. షకీలా ముక్కుసూటి తీరుతో గీతూ కొన్నిసార్లు షాక్ తిన్నట్టు ప్రోమోను కట్ చేశారు. బిగ్ బాస్ బజ్ ప్రోమోలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్టు స్పష్టమైంది.

Acter Shakeela Sensational comments on Pallavi Prashanth and Rathika Rose after Bigg Boss Telugu 7 Elimination

షకీలమ్మాను సాదారంగా ఆహ్వానిస్తూ.. మీరు ఆశ్రమానికి వెళ్లారా? బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లారా? అని తనదైన శైలిలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ఆమె మాటలకు అడ్డుకట్ట వేసింది. హౌస్‌లో శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా? అంటే.. నేను చెప్పానా? అని షకీలా ఎదురు ప్రశ్న వేసింది. దాంతో నేను అడుగుతున్నానంటూ గీతూ అంటే.. నీవేంటి నన్ను అడిగేది అంటూ షకీలా మళ్లీ ప్రశ్న వేయడంతో ఏం చెప్పాలో తెలియలేక తెల్లముఖం వేసింది.

షకీలాను అలాగే ప్రశ్నిస్తూ.. మీరు హౌస్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా? అని అడిగితే.. నేను అలా ప్లాన్ చేసుకొని రాలేదు అని షకీలా సౌమ్యంగా సమాధానం చెప్పింది. బిగ్‌బాస్‌కు రమ్మని పిలిచారు. నేను వచ్చాను. నాకంటూ ఓ గోల్ లేదు అని షకీలా చెప్పింది. ఇంటిలో శోభాశెట్టితోపాటు అందరూ ముఖాలకు మాస్క్ వేసుకొని నటిస్తున్నారు అని షకీలా చెప్పింది.

Acter Shakeela Sensational comments on Pallavi Prashanth and Rathika Rose after Bigg Boss Telugu 7 Elimination

కంటెస్టెంట్ల గురించి షకీలా మాట్లాడుతూ.. చిన్న సమస్య ఎదురైతే అమర్ దీప్ తట్టుకోలేకపోతున్నాడు. యావర్ పెద్ద ఎధవ.. బాడీ పెంచితే..ఏదైనా సాధించవచ్చు అనే భ్రమలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. ఇంట్లోకి వచ్చిన రోజు చెప్పులు బయట విడిచి వచ్చాడు. రెండో రోజు ఇంటి ముందు పెట్టాడు. మూడో రోజు ఇంట్లోకి చెప్పులు వేసుకొని వచ్చాడు. నాలుగో రోజు చెప్పులు కాళ్లకు వేసుకొని కాలిపై కాలు వేసుకొని ఆడించాడు. పాపులారిటి అనే డ్రగ్ మత్తులో ప్రశాంత్ ఉన్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Acter Shakeela Sensational comments on Pallavi Prashanth and Rathika Rose after Bigg Boss Telugu 7 Elimination

ఇక ఆట సందీప్ గురించి షకీలా మాట్లాడుతూ... ఇంటిలో ఉండాల్సిన హుందాతో ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించింది. శివాజీ గురించి మాట్లాడుతూ.. సొంత బ్రదర్ కంటే ఎక్కువ అని ప్రేమను కురిపించింది. రతిక గురించి మాట్లాడుతూ.. అందమైన విష సర్పం. ఎవరి కళ్లలోకి చూడదు. ఇతరులకు దొరికిపోతాననే భయం ఆమెకు ఉంది అని షకీలా కామెంట్ చేసింది.

Acter Shakeela Sensational comments on Pallavi Prashanth and Rathika Rose after Bigg Boss Telugu 7 Elimination

షకీలా ఎంత మంది సేఫ్ గేమ్ ఆడుతుందని అనుకొంటున్నారని గీతూ రాయల్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను చస్తే ఈ 14 మంది రావాలి. నాకు అదీ కావాలి అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. ప్రోమో మాత్రం ఆసక్తికరంగా కట్ చేశారు. ఇంకా ఫుల్ ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాలు చెప్పిందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X