బిగ్‌బాస్‌ 4‌లో అభిజిత్‌కు ఎంత ముట్టిందంటే.. కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్యాకేజ్

టాలీవుడ్ హీరోగా సక్సెస్ అవ్వాలని లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నడు. కానీ సినిమా బాక్సాఫీస్ పరంగా పెద్దగా హిట్టవ్వలేదు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే అతనికి బిగ్ బాస్ 4 చాలా బాగా ఉపయోగపడింది. కరెక్ట్ టైమ్ లో జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఆదాయ పరంగా కూడా అభిజిత్ కు మంచి లాభాలు అందాయని చెప్పవచ్చు.

ఆ తప్పులే.. అభికి ఉపయోగపడ్డాయి

ఆ తప్పులే.. అభికి ఉపయోగపడ్డాయి

105రోజుల పాటు కొనసాగిన బిగ్ బాస్ లో అభిజిత్ తన వ్యక్తిత్వంతోనే జనాలకు ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాడు. వీలైనంత వరకు తన పొరపాటు లేకుండా చేసుకున్నాడు. ఇక మిగతా వాళ్ళు చేసిన తప్పులు కూడా అభికి బాగా కలిసొచ్చాయి. ఏ మాత్రం తడబడకుండా చివరివరకు బాగానే కష్టపడ్డాడు. ఇక టైటిల్ అందుకున్న అభికి వచ్చిన రెమ్యునరేషన్ ఎంత అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

తక్కువ బడ్జెట్ లోనే..

తక్కువ బడ్జెట్ లోనే..

అసలు ఈ సారి బిగ్ బాస్ షో హిట్ అవుతుందా లేదా అనే టాక్ అయితే గట్టిగానే వచ్చింది. బిగ్ బాస్ 4లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది. నిర్వాహకులు తక్కువ బడ్జెట్ లోనే ప్లాన్ చేశారని అర్ధమయ్యింది. ఎక్కువగా రెమ్యునరేషన్ భారం పడకుండా కంటెస్టెంట్స్ ను తక్కువ పేమెంట్స్ కు ఒప్పించి రప్పించారని కథనాలు కూడా వచ్చాయి.

సినిమా చేసినా ఇంత వచ్చి ఉండేది కాదు

సినిమా చేసినా ఇంత వచ్చి ఉండేది కాదు

అయితే కొందరికి మాత్రం క్రేజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే దక్కింది. ఇక అభిజిత్ కూడా తన కెరీర్ ను సైతం పక్కనపెట్టి రిస్క్ చేయడంతో మంచి ఆదయమే అందుకున్నాడు. ఒక విధంగా అతనికి సినిమా చేసినా కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చి ఉండేది కాదు. పైగా గెలవడమే అతనికి బ్లాక్ బాస్టర్ లాంటి హిట్టుతో సమానం.

మొత్తం ఆదాయం ఎంతంటే..

మొత్తం ఆదాయం ఎంతంటే..

ఇక అభిజిత్ 105రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నందుకు గాను వీక్లీ పేమెంట్ ప్రకారం దాదాపు 60లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రైజ్ మనీ 25లక్షలు వచ్చాయి. మొత్తం ప్రైజ్ మనీ వచ్చి ఉంటే లెక్క కోటి దాటి ఉండేది. ఇక ఓట్లు కూడా గట్టిగానే వచ్చాయి. అభి ఆదాయం కంటే ఎక్కువగా తనకంటూ ఒక అభిమానాన్ని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.

బోనస్ గా కూడా మంచి లాభమే..

బోనస్ గా కూడా మంచి లాభమే..

ఇక బోనస్ గా అభికి ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కూడా దక్కింది. దాదాపు దాని విలువ మూడు లక్షల రూపయలు ఉంటుందట. ఇక ఏ విధంగా చూసుకున్నా కూడా అభికి మొత్తం మంచి లాభాలు అందాయి. ఇక రానున్న రోజుల్లో అభి వద్దకు నిర్మాతలు క్యూ కడతారని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థలు మనోడి కోసం కథలు రెడీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X