గర్ల్ ఫ్రెండును గర్భవతిని చేసాడు: టీవీ నటుడి అరెస్ట్!

By Bojja Kumar

ముంబై: ఓషివరా పోలీసులు హిందీ టీవీ యాక్టర్ ఆహ్వాన్ కుమార్‌ను అరెస్టు చేసారు. ఆహ్వాన్ కుమార్ తనను రేప్ చేసాడంటూ అతని గర్ల్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమె కూడా హిందీ టెలివిజన్ పరిశ్రమలోనే పని చేస్తుండటం గమనార్హం.

గత కొంత కాలంగా ఆహ్వాన్ కుమార్, ఆమె ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా కలిసినట్లు సమాచారం. దీంతో సదరు మహిళ గర్భం దాల్చింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నో చెప్పడంతో పాటు అబార్షన్ చేసుకోవాలని ఆహ్వాన్ కుమార్ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై రేప్ కేసు పెట్టింది ఆహ్వాన్ కుమార్ గర్ల్ ఫ్రెండ్.

Actor Ahwaan Kumar arrested for allegedly raping his girlfriend

ఈ మేరకు ఆహ్వాన్ కుమార్‌ను ఓషివరా పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. తొలుత ఆమె కంప్లైంట్ చేసినా...పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆమె కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియాను కలిసింది. కమీషనర్ ఫిర్యాదు మేరకు ఓషివరా పోలీసులు ఆహ్వాన్ కుమార్‌పై కేసు నమోదు చేసారు.

ఆహ్వాన్ కుమార్ ద్వారా ఆమె గర్భం దాల్చగా....12, ఫిబ్రవరి 22న ఆమెను ముంబై అందేరిలోని సంగీత నర్సింగ్ హోంలో అడ్మిట్ చేయించి అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. హాస్పటల్ రికార్డుల్లో ఆహ్వాన్ కుమార్ ఆమె భర్తగా రికార్డు చేయించుకున్నారు. అప్పటి నుండి సదరు నటి అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అయితే పెళ్లికి ఆహ్వాన్ కుమార్ తిరస్కరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. స్టార్ వన్ లో వస్తున్న ‘గీత్' అనే సీరియల్‌లో ఆహ్వాన్ కుమార్ నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X