For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంకర్ సుమకు అలీ మరో షాక్.. గత వివాదం నుంచి గుణపాఠం..!

|
Anchor Suma Gets Some Bad Moment From Actor Ali in Lovers Day Audio Function

నాలుగు దశాబ్దాలుగా హీరోగా, కమెడియన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న ఆలీ అప్పుడప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటారు. నటుడిగా వివాదాలకు దూరంగా ఉండే అలీ యాంకర్‌గా మారినప్పుడే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. పలు ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు యాంకర్ వ్యవహరిస్తుండటం తెలిసిందే. కొన్నిసార్లు నోటిదురుసును ప్రదర్శిస్తుంటారు. దాంతో ఆయన ఇబ్బందుల్లో పడుతుంటారు. తాజాగా లవర్స్ డే ఫంక్షన్‌లో సుమ భర్త రాజీవ్ కనకాలపై అతిగా సెటైర్లు వేసి బుక్ అయిపోన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టి పెట్టుకొని అలీ ఇటీవల సుమతో జాగ్రత్తగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.

 లవర్స్ డే ఆడియో ఫంక్షన్‌లో

లవర్స్ డే ఆడియో ఫంక్షన్‌లో

లవర్స్ డే ఫంక్షన్‌లో కాట్రవల్లీ భాషలో మాట్లాడుతూ సుమను ఇబ్బందికి గురిచేశాడు. అదే ఫ్లోలో రాజీవ్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అలీ మాటలతో సుమ ఓ దశలో నీ నోట్లో నేను నోరు పెట్టడమే తప్పయింది అనే మాటను వదిలింది. దాంతో అలీపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి.

40 ఏళ్ల కెరీర్‌ పూర్తిచేసుకొన్న అలీ

40 ఏళ్ల కెరీర్‌ పూర్తిచేసుకొన్న అలీ

నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకొన్న అలీకి ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఇలాంటి సంతోషకరమైన పరిస్థితుల్లో సుమ హోస్ట్‌గా వ్యవహరించే క్యాష్ అనే కార్యక్రమంలో అలీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో సెటైర్లు వేస్తూనే నాలుకను కంట్రోల్ పెట్టాడు.

 సుమ నా చెల్లి అని అలీ..

సుమ నా చెల్లి అని అలీ..

క్యాష్ ప్రొగ్రాంలో గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వేదికపైకి వస్తూనే సుమకు వినమ్రంగా నమస్కారం పెట్టాడు. అతిగా మాట్లాడకుండా పొదుపుగా మాట్లాడుతానని ముందుగానే చెప్పాడు. ఈ సందర్భంగా సుమ నా చెల్లి అంటూ సంబోధించాడు. దాంతో సుమ షాకితిన్నట్టు చూస్తూనే ఓ రకంగా నవ్వుతూ అలీ మారిపోయాడనే రీతిలో లుక్కించింది.

 వివాదాలు పోవద్దని

వివాదాలు పోవద్దని

సుమ చూసిన చూపుకు అలీ స్పందిస్తూ.. మనసులో ఎలాంటి ఉద్దేశం లేకుండా ఏం మాట్లాడినా వివాదం అవుతున్నది. అందుకే చెల్లి అని క్లారిటీ ఇచ్చాను అని చెప్పాడు. దాంతో సుమ, అలీ మధ్య నవ్వులు చోటుచేసుకొన్నాయి. దాంతో ఆ కార్యక్రమం ఎలాంటి సమస్యలు లేకుండా సవ్యంగా సాగిపోయింది.

మాటలు అలా జారిపోతుంటాయని

మాటలు అలా జారిపోతుంటాయని

ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదికపై చోటుచేసుకొన్న వివాదాలపై సానుకూలంగా స్పందించాడు. వేదిక మీద ఉన్నప్పుడు జాగ్రత్తగానే మాట్లాడాలని అనుకొంటాను. కానీ జనం జోష్ చూసి అప్పుడప్పుడు మాటలు జారి పోతుంటాయి. ఒక్కసారి మాట జారిన తర్వాత అవి ఎలాంటి పరిస్థితిని తీసుకోస్తాయో చాలా సందర్బాలు గుణపాఠం నేర్పాయి అని అలీ అన్నారు.

English summary
Anchor Suma gets some bad moments from Actor Ali while hosting many shows. One of them is, Lovers day audio function. Ali made some objectionable commets on Suma husband Rajeev Kankala. In this, occassion, Ali met in Suma show, and called her as sister.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more