చిల్లింగ్ మూమెంట్: ఆనందంతో అనసూయ గంతులు (ఫోటోస్)
Recommended Video

హైదరాబాద్‌లో ఎండలు మండి పోతుండటంతో బిజీ బిజీగా సాగే తన వర్క్ షెడ్యూల్ నుండి కాస్త గ్యాప్ తీసుకుని చిల్ అయ్యేందుకు హిమాలయాకు వెళ్లింది యాంకర్ అనసూయ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ లడఖ్ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబందించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానుతో పంచుకున్నారు. ఇకపై ఏడాదిలో ఒక్కసారైనా ఇండియాలోని కొత్త ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు అనసూయ తెలిపారు.

గర్వంగా ఫీలవుతున్నాను
ఇంక్రెడబుల్ ఇండియాను చూసి గర్వపడుతున్నాను. అపారమైన ప్రకృతి వనరులు, భిన్న సంస్కృతులు, ఆచారాలకు నెలవైన ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం అంటూ అనసూయ ఈ సందర్భంగా తన పోస్టులో పేర్కొన్నారు.

ఆనందంతో అనసూయ గంతులు
లేహ్ అఢఖ్ వద్ద ప్రకృతి సౌందర్యాన్ని చూసిన ఈ చలాకీ యాంకర్ ఆనందంతో గంతులేశారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫ్యామిలీ ట్రిప్
తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ లఢఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

సెల్పీలతో హల్ చల్
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే అనసూయ తన పర్యటనకు సంబంధించిన సెల్ఫీ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తున్నారు.

వరుస సినిమా అవకాశాలు
‘రంగస్థలం' మూవీలో రంగమ్మత్తగా అనసూయ పాత్ర పాపులర్ కావడంతో వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాలో అనసూయ కోసం స్పెషల్ పాత్ర క్రియేట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అనసూయ ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి' అనే మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ మొత్తం అనసూయ చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది. అనసూయ నటించిన మరో చిత్రం ‘సచ్చిందిరా గొర్రె' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











