సుమను బహిరంగంగా ముద్దాడిన యాక్టర్.. రాజా అది కాదు అంటూ భర్తకు యాంకర్ సంజాయిషీ
అందం, అభినయంతో పాటు ఆకట్టుకునే మాటలతో ఎంతటి వారినైనా సమ్మోహితులను చేయగల సత్తా సుమ కనకాల సొంతం. యాంకర్లకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన ఘనత ఆమెది. నటి కావాలనుకున్న లక్ష్యంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి, నేడు స్టార్లతో సమానంజగా స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సుమ. తెలుగింటి ఆడపడచుకు కాకపోయినా తెలుగును ఆనర్గళంగా మాట్లాడుతూ.. చెడుగుడు ఆడుకోవడంలో ఆమెకు ఆమె సాటి.
సుమ అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమ అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు దాదాపుగా ఫేడవుట్ అయిపోతుంటే ఆమె మాత్రం నేటికీ బిజీగా ఉన్నారు. ఎందరో అమ్మాయిలు యాంకరింగ్ వైపు రావడానికి, నిలదొక్కుకోవడానికి సుమ స్పూర్తిగా నిలిచారు. స్టేజ్ ఎక్కాలంటే కొందరు భయపడిపోతుంటారని.. కానీ తనకు మాత్రం ఎక్కడా లేని ఊపు వస్తుందని ఆమె సరదాగా అంటుంటారు.

తొలుత దాసరి నారాయణరావు దర్శక , నిర్మాణంలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో సుమ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మాతృభాష మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె పవిత్ర ప్రేమలో బాలకృష్ణ చెల్లెలిగా కనిపించారు. చిన్నా చితకా పాత్రలు చేస్తూనే యాంకరింగ్ వైపు అడుగులు వేసిన సుమ ఆ రంగంలో టాప్ పొజిషన్ చేరుకున్నారు. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇటీవలే కుమారుడు రోషన్‌ను ఆమె హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది.
స్టేజ్‌పై యాంకరింగ్ చేస్తూ గలగలా మాట్లాడటమే కాకుండా చాకచక్యంగా వ్యవహరించి సభా గౌరవాన్ని నిలబెట్టేందుకు సుమ ఎంతో కష్టపడతారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. తాజాగా అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పా రంజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడిక్ హారర్ డ్రామా తంగలాన్ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. మాళవిక మోహనన్, పార్వతి కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్‌కు మంచి స్పందన వచ్చింది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండగా.. తాజాగా తంగలాల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని సుమ హోస్ట్ చేశారు.
ఈ ఈవెంట్‌లో అనుకోని సంఘటన జరిగింది. తంగలాన్‌లో నటించిన ఒక్కక్క స్టార్ స్టేజ్‌పైకొచ్చి మాట్లాడారు. ఈ క్రమంలోనే డేనియల్ అనే నటుడు కూడా వచ్చి ఈ సినిమా సంగతులను పంచుకున్నాడు. ఇంగ్లీష్ నటుడైన అతనితో సుమ తెలుగులో మాట్లాడించి కాసేపు నవ్వించింది. అయితే డేనియల్ కిందకి వెళ్లేటప్పుడు సుమకి థ్యాంక్స్ చెప్పి, షేక్ హ్యాండ్ ఇస్తూ.. సడెన్‌గా సుమ చేతిపై ముద్దుపెట్టాడు. ఊహించిని ఘటనతో సుమ ఒక్కసారిగా షాకైనా వెంటనే తేరుకుని నేను ఈరోజు ఇంటికెళ్తానా.. ఓరి నాయనో.. రాజా (రాజీవ్ కనకాల) ఈయన మా అన్నయ్య.. రాఖీ వస్తుంది.. అన్నయ్య సన్నిధి అంటూ అద్భుతంగా కవర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సుమ సమయస్పూర్తిని, చాకచక్యాన్ని ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











