For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హైపర్ ఆది మోసం.. దొరబాబుకి ఫోన్ చేస్తే అలా.. తెలుగు నటుడు సంచలన ఆరోపణలు!

  |

  లీడింగ్ కామెడీ షో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన ఆది అతి కొద్దికాలానికే ఆది హైపర్ ఆదిగా మారాడు. అతి తక్కువ కాలంలోనే ఒక ఒక టీమ్ లీడర్ స్థాయికి ఎదిగి జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే అలాంటి ఆది ఇటీవలి కాలంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంతో పాటు ఆయన మీద ఒక నటుడు సంచలన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  షార్ట్ ఫిలింతో

  షార్ట్ ఫిలింతో

  బీటెక్ పూర్తి అయిన తర్వాత ఇంజనీరుగా ఉద్యోగం చేసిన ఆది అనుకోకుండా చేసిన ఒక షార్ట్ ఫిలిం ద్వారా అదిరే అభి కళ్లల్లో పడ్డారు. అలా అభి టీంలో కొన్ని స్కిట్స్ చేసిన తర్వాత ఆయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన మల్లెమాల సంస్థ ఏకంగా ఆయనను టీం లీడర్ ని చేసింది. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అది ఇప్పటికీ జబర్దస్త్ లో లీడింగ్ పొజిషన్ లోనే కొనసాగుతున్నాడు.

  మరో వివాదంలో

  మరో వివాదంలో

  కొద్ది రోజుల క్రితం ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో బతుకమ్మకు సంబంధించిన ఒక పాట విషయంలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాను ఆ మాటలు అనలేదు అని ఆది అంటుంటే అన్నా అనకపోయినా అందులో భాగంగా ఉన్నారు కాబట్టి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆ వివాదం సద్దుమణగక ముందే ఆది మీద మరో నటుడు కీలక ఆరోపణలు చేశాడు.

  దొరబాబు లానే దావూద్

  దొరబాబు లానే దావూద్

  నిజానికి ఆది టీంలో దొరబాబు అనే నటుడు కూడా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. దొరబాబు ఒకప్పుడు యూట్యూబ్ లో వచ్చే కొన్ని రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించడానికి కారణంగా ఎక్కువగా అదే పాయింట్ తో అది ఆయన మీద పంచులు వేస్తూ ఉంటాడు ఆది. అయితే ఆయన లాగే ఉన్న మరో నటుడు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. ఆయన పేరు దావూద్. ఆంధ్రప్రదేశ్లోని ప్రొద్దుటూరుకు చెందిన ఈ నటుడు కూడా ఒకపక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క సీరియల్స్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఆయనని ప్రొద్దుటూర్ దావూద్ అని పిలుస్తూ ఉంటారు.

  ఆది మోసం

  ఆది మోసం

  అయితే వీరిద్దరూ కలిసి హైపర్ ఆది చేసిన ఒక కవలల స్కిట్ లో నటించారు. ఆ స్కిట్ లో నటించడం తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని దావూద్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తానూ దొరబాబు ఒక్కరం కాదని క్లారిటీ ఇవ్వాలని తనకు దొరబాబుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని హైపర్ ఆదిని చాలా సార్లు అడిగాను అని అన్నారు. సరే క్లారిటీ ఇస్తానని చెబుతా అని చెప్పి ఎప్పటికప్పుడు ఏవో ఒక సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకు తిరుగుతూ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

  ఫోన్ చేస్తే అలా

  ఫోన్ చేస్తే అలా

  ఇక అలాగే ఏదైనా సినిమాలో గాని సీరియల్ లో గాని తాను నటించినప్పుడు అది చూసి పొరపాటు పడి ఎవరైనా దొరబాబుకు ఫోన్ చేసి ఫలానా సినిమాలో బాగా చేశారు అంటే ఆయన థాంక్స్ అని చెబుతున్నట్లు తనకు తెలిసిందని, అలా తాను చేసిన పాత్రలకు ఆయన అభినందనలు అందుకుంటే తనకు బాధగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన ఆ పాత్రలు చేయలేదు ఆ పాత్ర చేసింది దావూద్ అనే నటుడు అని చెబితే చాలా బాగుంటుందని కానీ ఆయన తానే ఆ పాత్ర చేసినట్లు ఫీల్ అవుతూ థాంక్స్ అని చెపుతూ ఉండటం తన భాధిస్తోందని చెప్పుకొచ్చారు.

  Actor Gopichand Inspiring Life Story | Filmibeat Telugu
  చాల సినిమాల్లో

  చాల సినిమాల్లో


  దావూద్ కూడా అచ్చంగా దొరబాబు లాగానే కనిపిస్తారు కానీ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు. దావూద్ కూడా తెలుగులో చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. మరీ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మర్డర్ అనే సినిమాలో సుపారీ తీసుకుని హత్య చేసే వ్యక్తిగా అలాగే వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాలో బండ్ల గణేష్ పాత్రలో నటించారు.

  English summary
  Actor Dawood Reveal Shocking Facts About Hyper Aadi and dorababu in a youtube interview. he reveals some experiences with them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X