ఏం చేయాలో అంతా చేసేసింది... యాంకర్ ఝాన్సీ గురించి జోగినాయుడు
యాంకర్, యాక్టర్ జోగి నాయుడు అంటే ఠక్కున జోగి బ్రదర్స్ షో గుర్తుస్తుంది. నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అటు సినిమాల్లోనే కొనసాగుతూ.. రాజకీయాల్లో కూడా సేవ చేస్తున్నారు. యాంకర్ ఝాన్సీ మాజీ భర్తగా జోగి నాయుడు ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఝాన్సీ గురించి, మిగితా విషయాల గురించి జోగి నాయుడు ఏం చెప్పారంటే..

ఝాన్సీ నటన గురించి జోగి నాయుడు
ఇటీవల ఝాన్సీ నటించిన F2, మల్లేశం సినిమాలు చూశాను. సహజంగానే అద్భుతమైన నటి. మల్లేశం సినిమాలో మధ్య తరగతి ఇల్లాలి నుంచి వృద్ధురాలి వరకు మూడు నాలుగు షేడ్స్‌లో కనిపించారు. ఆమె టాలెంట్ మరోసారి బయటకు వచ్చింది. తెలంగాణ యాసలో మాట్లాడటం ఆమెకు ఆమె సాటి. టాక్ ఆఫ్ ది టౌన్ కార్యక్రమానికి ఆమె హోస్ట్‌గా చేసేటప్పుడు సుమారు 500 రకాల వేషాలు వేసింది. తెలంగాణతోపాటు అన్ని రకాలు యాసలను ఆమె పట్టుకొన్నారు అని జోగి నాయుడు తెలిపారు.

ఝాన్సీకి అవార్డులు కూడా రావొచ్చు
వెంకటేష్‌తో జయం మనదేరా సినిమాలో అద్భుతంగా నటించింది. ఆ పాత్రకు ఆమెకు అవార్డు కూడా నటించింది. మరో సినిమాలో కోకాపేట ఆంటీగా నటించి మెప్పించారు. ఇక F2లో తెలంగాణ యాసలో మరోసారి అలరించింది. ఇలాంటి క్యారెక్టర్లు ఎన్ని చేయాలో అన్ని చేసేసింది. F2, మల్లేశం సినిమాలో నటనకు ఝాన్సీకి అవార్డు కూడా రావొచ్చని భావిస్తున్నాను అని జోగి నాయుడు పేర్కొన్నారు.

పాలిటిక్స్‌లోకి ఎందుకంటే..
రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తి. జోగి బ్రదర్స్ షో తర్వాత అప్పట్లో సీఎం వైఎస్ఆర్‌ను కలిశాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన ప్రచారా కార్యక్రమాల్లో నటించాం. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీఎంబర్స్ మెంట్ కార్యక్రమాలను షూట్ చేసి ప్రచారం చేశాం. అలా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరాను. పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను అని జోగి నాయుడు తెలిపారు.

నా టార్గెట్‌ను రీచ్ అయ్యాను
నేను సినిమా రంగానికో, రాజకీయాలకు పరిమితం కాను. నేను డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ యాక్టర్‌ను అయ్యాను. డైరెక్టర్, పొలిటిషియన్ కావడం నా టార్గెట్ కాదు. నేను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నానని భావిస్తున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు పనిచేశాను. అవసరమైతే భవిష్యత్‌లో కూడా పనిచేస్తాను. సినిమాలో మంచి బ్రేక్ వస్తే మళ్లీ బిజీ అవుతాను అని జోగినాయుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











