Jabardasth జడ్జీగా టాప్ కమెడియన్.. వచ్చీ రాగానే ఇంద్రజపై దారుణంగా!
ఒకప్పుడ జబర్దస్త్ షోకు రెండు కళ్లలా నాగబాబు, రోజా ఉండేవారు. ఆ ఇద్దరి నవ్వులు, కామెంట్లు, జడ్జ్‌మెంట్లతో జబర్దస్త్ షో మూడు పువ్వులు ఆరు కాయల్లా షో నడిచేసింది. ఇక అనసూయ అందాలు, రష్మీ గౌతమ్ హోయలు, ఆది సుధీర్ గెటప్ శ్రీను పంచులు స్కిట్లతో రంగరంగ వైభవంగా షో నడిచేది. టీఆర్పీల్లో కింగ్‌లా షో నడిచేది. కానీ అలాంటి జబర్దస్త్ షో పరిస్థితి దారుణంగా మారిపోయింది. జబర్దస్త్ షొలోకి కొత్త వారు వస్తున్నారు.. పాత వారు పోతోన్నారు. ఇలా వచ్చే వారు వస్తూనే.. పోయే వారు పోతూనే ఉన్నారు.

అంతా మార్పులే..
నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్ షోను వదిలి పెట్టి పోయాడో.. అప్పటి నుంచి ఆ షో గతి తప్పింది. ఇక కొన్ని రోజుల పాటు రోజా అక్కడ ఏకఛత్రాదిపత్యాన్ని చూపించింది. అంతా తానై నడిపించింది. రెండో జడ్జ్ కోసం నానా రకాలుగాప్రయత్నాలు చేశారు. కానీ ఏ ఒక్కరూ కూడా నాగబాబు స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు.

ఎంతో మంది మార్పులు..
నాగబాబు వెళ్లిన తరువాత ఇంకొంత మంది సీనియర్ హీరోయిన్లను తీసుకొచ్చింది మల్లెమాల సంస్థ. సంఘవి, లైలా, ఆమని, కుష్బూ వంటి వారంతా కూడా గెస్ట్ జడ్జ్‌లుగా వచ్చారు. ఆ తరువాత పూర్ణ, శ్రద్దా దాస్ వంటి వారు కూడా వచ్చారు. అయితే ఏ ఒక్కరు కూడా సెట్ కాలేదు. అయితే మధ్యలో ఆలీ కూడా కొన్ని ఎపిసోడ్‌లలో కనిపించాడు. చివరకు మనోను జడ్జ్‌గా ఫిక్స్ చేశారు.

మెప్పించిన మనో..
మనో జబర్దస్త్ జడ్జ్‌గా బాగానే మెప్పించాడు. జడ్జ్ సీటులో కూర్చుని పంచులు వేసేవాడు.. స్టేజ్ మీదకు వచ్చి స్కిట్లు వేసేవాడు. ఆది, సుధీర్ టీంల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చేవాడు. అయితే మనో బాగానే సెట్ అయ్యాడు అనుకునే సమయంలో రోజా కూడా బయటకు వచ్చింది. ఇక రోజా స్థానంలో ఇంద్రజ బాగానే ఆకట్టుకుంటోంది. మనో కూడా స్టార్ మా సింగింగ్ షోకు వెళ్లిపోయాడు.

రెండో జడ్జ్ కోసం..
మనో అలా వెళ్లడం, ఇలా వస్తుండటం జబర్దస్త్ షోకు కాస్త ఇబ్బందిగా మారింది. పర్మనెంట్‌గా ఓ జడ్జ్ ఉండాలని భావించినట్టున్నారు. అందుకే మళ్లీ వేటను కొనసాగించినట్టున్నారు. కానీ కుష్బూ, శ్రద్దా దాస్, ప్రగతి వంటి వారిని తీసుకొచ్చారు. రెండు మూడు ఎపిసోడ్‌లు ట్రై చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు.

కనిపించిన కృష్ణ భగవాన్..
జబర్దస్త్ షోకు సరైన జడ్జ్ కోసం వెతుకున్న సమయంలోనే శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి కృష్ణ భగవాన్ ఓ సారి వచ్చాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు గెస్టుగా వచ్చి అదరగొట్టేశాడు. ప్రాసలు, పంచ్‌లతో అందరినీ ఆడేసుకున్నాడు. ఈ స్పాంటేనిటీ, కామెడీ టైమింగ్ చూసి అంతా ఫిదా అయ్యారు. ఈయన జడ్జ్‌గా ఉంటే బాగుంటుందని అంతా అనుకున్నారు. నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇంద్రజ మీద పంచ్‌లు..
అందరి కోరిక మేరకు జబర్దస్త్ కొత్త జడ్జ్‌గా కృష్ణ భగవాన్ జడ్జ్ కుర్చీలో కూర్చుండిపోయాడు. మొదటి ఎపిసోడ్‌లోనే చించి అవతల పారేశాడు. తాగుబోతు రమేష్ టీం చేసిన స్కిట్ మీద ఇంద్రజ జడ్జ్మెంట్ ఇవ్వడం, స్కిట్ కంటే ఆమె జడ్జ్మెంటే పెద్దగా ఉందని ఇంద్రజ మీద కూడా ఆయన కౌంటర్లువేశాడు. దీంతో ఇంద్రజ ఒక్కసారిగా అవాక్కైంది.


Click it and Unblock the Notifications











