మోనాల్ కంటే నేను బెటర్.. అన్యాయంగా పంపించారు.. రీఎంట్రీపై కుమార్ సాయి క్లారిటీ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ 4 సీజన్‌లో కొందరు కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్‌ వివాదాస్పదంగా మారాయి. ప్రేక్షకుల మనోభావాలకు విరుద్ధంగా కొందరిని ఇంటి నుంచి పంపించారనే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. అన్యాయంగా ఇంటి నుంచి పంపించారనే సానుభూతి కుమార్ సాయిపై ఎక్కువగా కనిపించింది. అయితే తాజాగా కుమార్ సాయి రీ ఎంట్రీ ఇస్తున్నారే విషయంపై స్పందిస్తూ..

నా ఫెర్ఫార్మెన్స్ గురించి తెలుసు

నా ఫెర్ఫార్మెన్స్ గురించి తెలుసు

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం నేను సినిమా స్క్రిప్టులు, ప్రాజెక్టుల విషయంలో బిజిగా ఉన్నాను. బిగ్‌బాస్‌లోకి మళ్లీ నన్ను రావాలను ప్రేక్షకులు కోరుకొంటున్నారనే విషయం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. అలా డిమాండ్ రావడంతో నా ఫెర్ఫార్మెన్స్ ఏమిటో ప్రజలు గుర్తించారనే ఫీలింగ్ కలుగుతున్నది. మళ్లీ అవకాశం వస్తే దానిని వదులుకోను. ప్రేక్షకులకు వినోదం అందించడానికి ప్రయత్నిస్తాను అని కుమార్ సాయి తెలిపారు.

ఒంటరిగానే పోరాడుతాను..

ఒంటరిగానే పోరాడుతాను..

బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే.. నాకు ఎలాంటి ప్లాన్స్ ఉండవు. రియాలిటీతో అప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొంటాను. ఇంట్లోకి వెళ్తే నా వ్యూహాలను అమలు పరచడానికి ఎక్కువ సమయం తీసుకొను. స్నేహితులను, ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవడానికి వెళ్లడం లేదనే విషయం తెలుసు. ఎప్పుడు నేను ఒంటరిగానే పోరాడుతాను అని కుమార్ సాయి పేర్కొన్నారు.

 మోనాల్ కంటే నేను బెస్ట్

మోనాల్ కంటే నేను బెస్ట్

నా ఎలిమినేషన్ విషయంలో అసంతృప్తి ఉంది. ఓట్ల గురించి పక్కన పెడితే.. మోనాల్ కంటే నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చానని విశ్వాసం, నిజాయితీతో చెప్పగలను. ఆ రోజున ఎలిమినేట్ అవుతానని మోనాల్ ఫిక్సయింది. కానీ ఆమె సేవ్‌ చేసి.. నన్ను ఎలిమినేట్ చేశారు. బిగ్‌బాస్ నిర్ణయాన్ని నేను అంగీకరించాను అని కుమార్ సాయి వెల్లడించారు.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
ఇంటిలో గూడుపుఠాణి..

ఇంటిలో గూడుపుఠాణి..

ఇంటి సభ్యుల మధ్య గూడుపుఠాణి ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొందరు ఒకరికొకరు ఫేవరిటిజం ప్రదర్శిస్తున్నారు. ఏ కారణం లేకుండా స్నేహితుల కోసమే.. లేక ఏద కారణంతో శత్రువులుగా భావించి నామినేట్ చేస్తున్నారు. అలాంటి వారిలో హారిక, లాస్య ఇతరులు ఉన్నారు అని కుమార్ సాయి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X